చరణ్ నిర్మాతగా వెంకటేష్ మూవీ …వర్కౌట్ అవుతుందా ..?

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు నిర్మాతగాను బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇప్పటికే నాన్న మెగాస్టార్ చిరంజీవి తో ఖైదీ 150, సైరా సినిమాలను నిర్మించి సక్సస్ సాధించాడు. అంతేకాదు ఈ నిర్మాణ సంస్థ కేవలం తన తండ్రి కోసం మాత్రమే అని రామ్ చరణ్ ఇంతకముందు చెప్పిన సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై వరుసగా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమాలు నిర్మిస్తున్నప్పటికి.. ఈ బ్యానర్ లో వేరే హీరోలతో సినిమాలు తీస్తారా ..అని అడిగినప్పుడు చరణ్ లేదు అని ఒక్కమాటతో సమాధానమిచ్చారు.

 

ఇక ఖైదీ నెంబర్ 150 తో కొణిదెల కాంపౌండ్ లో చరణ్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుని ఆ తర్వాత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ ని అదే బ్యానర్ లో నిర్మించారు. ఇక ప్రస్తుతం మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి చిరు 152వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొణిదెల బ్యానర్ లో చిరుకి ఇది మూడో సినిమా. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇప్పటినుంచి వేరే హీరోలతో కూడా కొణిదెల బ్యానర్ లో చరణ్ సినిమాలు తీయబోతున్నాడని అర్తమవుతుంది.

ఇప్పటికే మలయాళం నుంచి ‘లూసీఫర్’…’డ్రైవింగ్ లైసెన్స్’ అనే సినిమాల రీమేక్ రైట్స్ ని చరణ్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ సినిమాలలో నటించే హీరోలు ఎవరు ..! అన్నది కంఫర్మ్ అవ్వాల్సి ఉంది. అయితే వరుసగా చిరుతోనే ఈ బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తుండటం.. రీమేక్ రైట్స్ తీసుకుని వాటిలో హీరోల్ని ప్రకటించకపోవడంతో బయట హీరోలతో చరణ్ సినిమాలు చేయరా? అన్న కొన్ని విమర్శలు ఈ మధ్య ఫిలిం నగర్ లో బాగా వినిపించాయి. ఈ నేపథ్యంలో చరణ్ వాటికి చెక్ పెట్టబోతున్నట్లు తాజా సమాచారం. ముందుగా సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఫస్ట్ సినిమా తెరకెక్కనుందట.

అయితే వెంకీ కోసం ఎలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేశారు ..దర్శకుడు, హీరోయిన్ .. అన్న అప్‌డేట్స్ మాత్రం ఇంకా గోప్యంగా ఉంచారు. ఇప్పటికే చరణ్ ‘లూసీఫర్’..’డ్రైవింగ్ లైసెన్స్’ సినిమాలు చేతిలో ఉన్నాయి కాబట్టి కాబట్టి వాటిలో ఏదైనా ఒక స్క్రిప్ట్ ను వెంకీ కోసం లాక్ చేశారని చెప్పుకుంటున్నారు. ఇక వెంకీ తో నిర్మించే సినిమాని చరణ్ సోలోగా నిర్మిస్తాడా లేక సురేష్ ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మిస్తాడా అన్నది కూడా కొంతమందిలో సందేహం వ్యక్తమవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news