చిరంజీవి, షర్మిల ఇద్దరికీ భారీ షాక్ ఇచ్చిన జగన్ ?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యసభ సీటు కోసం పోటీ మొదలయ్యింది. వైసీపీ ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో పార్టీలో ఎమ్మెల్సీ పదవిని ఆశించిన వారు రాజ్యసభ సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాజ్యసభ సభ్యుల ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది. ఇటువంటి సమయంలో వైసీపీ పార్టీలో వీళ్ళకి జగన్ రాజ్యసభలో స్థానం కల్పించారు అంటూ కొన్ని పేర్లు ఇటీవల ఏపీ మీడియా వర్గాల్లో సోషల్ మీడియాలో వార్తలు వినబడుతున్నాయి. Image result for sharmila chiranjeevi

చాలామంది పేర్లలో ఎక్కువగా చిరంజీవి మరియు వైఎస్ షర్మిల పేర్లు గత కొంత కాలం నుండి వినబడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అసలు వీళ్ళిద్దరి పేర్లు రాజ్యసభ రేసులో లేనట్లు వైసీపీ వర్గాల్లో వినికిడి. పార్టీలో వినబడుతున్న సమాచారం ప్రకారం బీద మస్తాన్ రావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలలో ఒకరికి రాజ్యసభ సీటు దక్కనుందని తెలుస్తోంది. మరో సీటు విషయంలో సీఎం జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి పేరు వినిపిస్తోంది.

 

వైవీ సుబ్బారెడ్డి ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్ గా ఉన్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎంపీ టికెట్ ను వైవీ సుబ్బారెడ్డి త్యాగం చేశారు. అందువలన వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ సీటు దక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. నాలుగో సీటు విషయంలో బీజేపీ పేరు తెరపైకి వస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా….జగన్ ను రాజ్యసభ సీటు కోరినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో చిరంజీవి మరియు వైయస్ షర్మిల కి జగన్ భారీ షాక్ ఇచ్చినట్లు తాజాగా వార్తలు బయటకు వస్తున్నాయి. 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news