బిగ్‌ బ్రేకింగ్‌ : లక్ష్మీ నారాయణకు జగన్ రాజ్యసభ ఇస్తున్నారా…?

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల సందడి నెలకొంది. అసలు రాజ్యసభ స్థానాలు జగన్ ఎవరికి ఇస్తారు…? నాలుగు స్థానాలు వైసీపీ నే కైవసం చేసుకుంటుంది కాబట్టి ఎవరికి ఆ స్థానాలను జగన్ కేటాయించే అవకాశం ఉంది…? దీనిపై అనేక ప్రశ్నలు వినపడుతున్నాయి. అనేక అనుమానాలు కూడా రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అయోధ్య రామిరెడ్డి, చిరంజీవి, మోపిదేవి వెంకటరమణ,

బీద మస్తాన్ రావు, వైఎస్ షర్మిల ఇలా ఎన్నో పేర్లు వినపడుతున్నాయి. పార్టీ కోసం నిలబడిన కొందరు పెద్దలను ఆయన రాజ్యసభకు పంపించే అవకాశం ఉందనే ప్రచారం కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతూ వస్తుంది. ఈ నేపధ్యంలో ఒక వార్త సోషల్ మీడియాలో ఎక్కువగా హల్చల్ చేస్తుంది. సిబిఐ మాజీ జెడి లక్ష్మీ నారాయణను జగన్ రాజ్యసభకు పంపిస్తారని అంటున్నారు.

కాస్త వింతగా ఉంది కదూ…? ఇప్పుడు చాలా మందికి ఈ వార్త వింతగానే ఉంది. అసలు ఆయనను ఏ విధంగా పంపిస్తారు అంటారా…? జనసేన పార్టీని ఆయన వదిలేసిన తర్వాత బిజెపిలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవానికి జెడి భావాలకు, ఆర్ఎస్ఎస్ భావాలకు దగ్గరి సంబంధం ఉంది. అందుకే ఆయన ఆ పార్టీలో చేరడం ఖాయమని పలువురు సోషల్ మీడియాలో ఎన్నో వ్యాఖ్యలు చేస్తున్నారు.

కాబట్టి, ఆయన బిజెపిలో చేరితే మాత్రం… కేంద్ర మంత్రిని చేయవచ్చు అంటున్నారు. కేంద్ర మంత్రిని చేస్తే రాజ్యసభకు పంపాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వైసీపీ నుంచి ఆయన రాజ్యసభకు వెళ్తే ఎన్డియే బలం రాజ్యసభలొపెరిగే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర పెద్దల అంగీకారం తోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని, కాదు కాదు కేంద్ర పెద్దల సూచనతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news