పర్యాటక శాఖ సిబ్బందికి జగన్ సర్కార్ శుభవార్త.. వారందరికీ ఉద్యోగాలు !

కోవిడ్ లో చనిపోయిన పర్యాటక శాఖ సిబ్బంది కుటుంబాలకు 2 లక్షల ఆర్థిక సహాయం, కుటుంబం లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తెలిపారు. 5 సంవత్సరాలు ఒకే చోట పని చేసిన వారికి బదిలీలు చేస్తామని… ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 36 రెస్టారెంట్లు, హోటల్స్ ఉన్నాయని… హాస్పటాలిటీ, బ్రాండింగ్ కు పెద్ద పీట వేశామని తెలిపారు.

Jagan
Jagan

గతంలో 120 కోట్ల ఆదాయం కోవిడ్ వల్ల ఇప్పుడు 60 కోట్లకు పడిపోయిందని… విశాఖ, పిచ్చుకలంక, విజయవాడ, బాపట్ల వంటి 13 చోట్ల పీపీపీ మోడల్ లో ఫైవ్ స్టార్ హోటళ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల సమగ్ర సమాచారం కోసం దసరా లోపు ప్రత్యేక యాప్ తీసుకురానున్నామని… 13 జిల్లాలను 4 సర్క్యూట్ లుగా విభజన చేశామన్నారు. ఒక్కో సర్క్యూట్ కు ఒక్కో మేనేజర్ ఉంటారని… సర్క్యూట్ ల వారీగా పర్యాటక ప్యాకేజీలు ఇస్తామని వెల్లడించారు. సీ ప్లేన్ ల కోసం త్వరలోనే కార్యాచరణ చేస్తామని… ఈ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా చేయాలని నిర్ణయించామన్నారు.