ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి ప్రస్తుతం రాష్ట్రంలో గానీ జాతీయ స్థాయిలో గాని ప్రస్తావన వచ్చిందంటే ఎక్కువగా రాజధాని అమరావతి గురించి మాట్లాడుకుంటున్నారు. మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి తీసుకు వచ్చిన జగన్ నిర్ణయానికి అమరావతి ప్రాంతంలో తీవ్రస్థాయిలో విమర్శలు మరియు ప్రభుత్వం పై వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం అందరికీ తెలిసినదే.
ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రస్తావన వచ్చినప్పుడు రాజధాని సెలెక్ట్ చేసుకోవడం లో హక్కుల మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటాయని కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకునే ప్రసక్తే లేదని ఉండదని పార్లమెంట్లో కేంద్ర మంత్రి తెలపడం జరిగింది. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వంలో నిధులు అడగాల్సిన సందర్భంలో వైయస్ జగన్ సర్కార్ రాజధాని అమరావతి పేరు చెప్పి నిధులు అడుగుతున్నట్లు తాజాగా వార్తలు బయటపడ్డాయి.
దీంతో రాష్ట్రంలో మూడు రాజధానులు అంటూ కేంద్రం వద్ద అమరావతి రాజధాని అంటూ డబ్బులు అడగటం ఏంటని రాష్ట్రానికి కేంద్రానికి మధ్య రాజధాని విషయంలో జరుగుతున్న గుట్టు మొత్తం బయట పెట్టాలని ప్రతిపక్ష పార్టీ టిడిపి తాజాగా ప్రశ్నించింది. ఇప్పటివరకు అమరావతి రాజధాని పేరిట కేంద్రం నుండి ఎంత డబ్బు రాబట్టడం జరిగిందని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు మూడు రాజధానులు అంటూ కలరింగ్ ఇస్తూ…కేంద్రం దగ్గర అమరావతి పేరు చెప్పి చేస్తున్న రాజకీయాలు జగన్ సర్కార్ బయటపెట్టాలని టిడిపి పార్టీ పెద్దలు ఇటీవల అమరావతి ప్రాంతంలో జగన్ సర్కార్ ని నిలదీశాయి.