కోర్టు తో నో చెప్పించుకోవడం వెనక జగన్ మాస్టర్ ప్లాన్ ?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పక్కా ప్లానింగ్ తో పరిపాలన సాగిస్తున్నారు. తన పరిపాలనలో ఎక్కడా కూడా అవినీతి జరగకుండా ప్రభుత్వానికి మరియు ప్రజలకు కనెక్షన్ ఉండేలా ఫస్ట్ నుండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార పార్టీ నేతలు అంతా రెడీ అవుతున్నారు. కాగా స్థానిక సంస్థల ఎన్నికలు 50 శాతానికి మించి జగన్ సర్కార్ రిజర్వేషన్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని ఇటీవల హైకోర్టు నో చెప్పింది. దీంతో 59.85 శాతాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కోసం జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం క్యాన్సిల్ అయినట్లు అయింది. Image result for jagan electionsఅయితే జగన్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఇప్పుడు బీసీలకు మరియు ఎస్సీ, ఎస్టీలకు టిడిపి పార్టీ వ్యతిరేక పార్టీగా నిలిచింది. అయితే ఇదంతా జగన్ యొక్క మాస్టర్ ప్లాన్ అని చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు కామెంట్ చేస్తున్నారు. విషయంలోకి వెళితే రిజర్వేషన్లకు కోర్టు తో నో చెప్పించడం వెనుక అసలు మాస్టర్ ప్లాన్ పంచాయతీ ఎన్నికలు బాగా లేటు గా జరపాలనే ఉద్దేశంతోనే జగన్ ఈ రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు వ్యాఖ్యానిస్తున్నారు.

 

ఇది అసాధ్యమని తెలిసినా గని గతంలోనే సుప్రీంకోర్టు 50 శాతాన్ని మించి రిజర్వేషన్లను ఇవ్వకూడదు అనే రూల్ పాస్ చేసింది.  అయితే జగన్ ఈ విధంగా వ్యవహరించడం వల్ల ఒకపక్క టిడిపి బీసీలకు మరియు బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేక పార్టీగా మారడం, మరో పక్క పంచాయతీ ఎన్నికలు లేటుగా జరిపించు కోవటం జగన్ ఉద్దేశం అని రాజకీయ విశ్లేషకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news