నివర్ వల్ల 30 వేల హెక్టర్ ల లో పంటలకు నష్టం వాటిల్లింది అని ఏపీ సర్కార్ అంచనా వేసింది. 13వేల ఎకరాలలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి అని కేబినేట్ లో నిర్ణయించారు. కడప జిల్లాలో పరిస్థితిని సమీక్షించడానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సీఎం ఆదేశాలతో అక్కడే ఉండి సమీక్షిస్తున్నారని ఏపీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తుఫాను శిబిరాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి 500 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇక జీవనాడి పోలవరం పై కాబినెట్ లో చర్చజరిగింది. పోలవరం ప్రొజెక్టు ఒరిజినల్ డిజైన్ ప్రకారం నిర్మాణం జరుగుతుంది అని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. 2017 లో అప్పటి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజి తీసుకునే క్రమం లో 2014 రేట్ ల ప్రకారం పోలవరం కు చెల్లిస్తాం అంగీకరించాలి అని కోరారని… అప్పట్లో ప్రతిపక్ష నేత గా తాను ఆ విషయాన్ని ప్రస్తావించాను అని కాబినెట్ లో జగన్ వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు డిఏ బకాయిలు… డిఏ 1 ఎర్రియర్స్ చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. 3.144 శాతం డి ఏ పంపుకు ఆమోదం తెలిపారు. 2,3 డిఏ లు కూడా త్వరలో చెల్లించాలని కాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. కరోన సమయం లో ఆపిన మార్చ్ నెల జీతాలను డిసెంబర్ లో, ఏప్రిల్ నెలలో పెండింగ్ బకాయిలు జనవరిలో అందిస్తాం అని స్పష్టం చేసారు.