ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది కరోనా వైరస్. దాదాపు భూమి మీద ఉన్న అన్ని ఖండాలలో అదేవిధంగా 70 దేశాలకు పైగా ఈ వైరస్ వ్యాప్తి చెందిన ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోకపోతే మానవ జీవన మనుగడకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం ఇటలీలో కరోనా వైరస్ జూలు విదిల్చిన సింహముల రెచ్చిపోతుంది. దాదాపు కొన్ని వేల మందిని బలి తీసుకున్నట్లు ఇంటర్నేషనల్ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. ఇదే టైమ్ లో ఇటలీ ప్రభుత్వం ఇంటి నుండి ఎవరైనా బయటకు వస్తే ఊరుకునే ప్రసక్తి లేదని కాల్చిపారేస్తాం అంటూ ప్రజలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అటువంటి ఇటలీ నగరం నుండి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి కరోనా వైరస్ రావడంతో మొన్నటివరకు కామ్ గా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దెబ్బకు దిగి వచ్చారు.
ఈ దెబ్బతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని సినిమా హాల్ మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు జిల్లాలో మాత్రమేగాక కుదిరితే అన్ని ఏరియాల్లో సినిమా థియేటర్స్ క్లోజ్ చేయడం బెటర్ అని వైయస్ జగన్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. ఇక విశాఖపట్టణంలో కూడా ఈ వైరస్ ఎఫెక్ట్ గట్టిగానే కనబడుతోంది. కాగా ఇంత సడన్ గా జగన్ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం చూస్తే అంతర్జాతీయ స్థాయిలో నమోదవుతున్న కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోవడం అనే టాక్ ఏపీ రాజకీయాల్లో వినబడుతుంది.