వైయస్ జగన్ 2019 ఎన్నికల్లో భారీ స్థాయిలో మెజార్టీ సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో 23 మంది సభ్యులు కలిగిన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న చంద్రబాబుని నేలమట్టం చేస్తారని అందరూ భావించారు. చంద్ర బాబు లాగానే తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుని అసెంబ్లీలో చంద్రబాబు కి ప్రతిపక్ష పాత్ర లేకుండా జగన్ చేస్తాడని అందరూ భావించారు. అయితే ఆ టైంలో అసెంబ్లీ స్టార్ట్ అయిన సందర్భంలో ఆ విధంగా చేస్తే తనకి చంద్రబాబుకు పెద్ద తేడా ఏమీ ఉండదని నిజాయతీ రాజకీయాల కు జగన్ విలువ ఇచ్చారు.
ఇక విలువైన రాజకీయాలు పక్కనపెట్టి తన పార్టీలోకి రావాలనుకుంటున్న టిడిపి ఎమ్మెల్యేలకు డోర్లు తెరవాలని చంద్రబాబు ని పూర్తిగా దెబ్బకొట్టాలని జగన్ డిసైడ్ అయ్యాడట. ఈ దెబ్బతో ప్రధాన ప్రతిపక్ష హోదా ఎగిరిపోతుంది. అదే సమయంలో శాసనమండలి కూడా రద్దు చేయిస్తే చంద్రబాబును రెండు రకాలుగాను దెబ్బ కొట్టినట్లవుతుందని జగన్ డిసైడ్ అయినట్లు వైసీపీ పార్టీలో వార్తలు వస్తున్నాయి.