కేసీఆర్‌ను ఫాలో అవుతున్న జ‌గ‌న్‌.. అందుకేనా ఆ నిర్ణ‌యం..

ఏపీ రాజ‌కీయాల్లో గ‌త కొద్ది కాలంగా చాలా రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ప్ర‌ధానంగా వినిపిస్తున్న రూమ‌ర్ ఏంటంటే ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయేమో అని. కాగా జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల‌ను టార్గెట్ గా పెట్టుకుని ఇప్ప‌టి నుంచే వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఇక ఆయ‌న్ను గ‌త ఎన్నిక‌ల‌లో బంప‌ర్ మెజార్టీ వ‌చ్చే విధంగా ప‌ని చేసిన ప్ర‌శాంత్ కిశోర్ టీమ్ ను ఇందుకోసం మ‌రోసారి రంగంలోకి దింపుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఆయ‌న్ను వ‌చ్చే ఏడాది నుంచి జ‌గ‌న్ రంగంలోకి దింపుతార‌ని స‌మాచారం. అయితే ఇక్క‌డే ఆయ‌న ఓ ప్లాన్‌ను ఫాలో అవుతున్నారంట‌.

అస‌లు ఇప్పుడు ఏపీలో వైసీపీని ఢీకొట్టే స్థాయిలో ఏ పార్టీ కూడా లేదు. మ‌రి ఆయ‌న ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే ఆలోచ‌న ఎందుకు చేస్తున్నార‌నే అనే చ‌ర్చ జోరందుకుంది. అయితే జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తే 2018ఎన్నిక‌ల స‌మ‌యంలో కేసీఆర్ ఇలాగే ముంద‌స్తుకు వెళ్లారు. జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తే త‌నకు ఇబ్బంది అని గ్ర‌హించిన సీఎం కేసీఆర్ వాటిని ఎదుర్కునేందుకు అసెంబ్లీని ర‌ద్దు చేసి మ‌రీ ముంద‌స్తుకు వెళ్లారు కేసీఆర్‌. కాగా ఆ ప్ర‌య‌త్నం బాగానే ఫ‌లించింది.

ఇక ఇప్పుడు జ‌గ‌న్ కూడా జ‌మిలి ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ను అనుచ‌రిస్తున్న‌ట్టు సందేహాలు వ‌స్తున్నాయి. ఇందులో భాగంగానే ప్ర‌శాంత్ కిశోర్ టీమ్ ను దింపి మ‌ళ్లీ గెల‌వాల‌నే ప్లాన్‌లో ఉన్నారంట‌. జ‌మిలి కంటే ముంద‌స్తు ఎన్నిక‌లు బెట‌ర్ అనే ప్లాన్‌లో జ‌గ‌న్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఇక్క‌డే మ‌రో విష‌యం ఏమిని వినిపిస్తోందంటే న‌రేంద్ర‌మోడీ ప్ర‌భుత్వం వ‌చ్చేసారికి దేశ వ్యాప్తంగా ఒకే సారి జ‌మిలి ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇలా ప్లాన్ చేస్తున్న‌ట్టు అంతా భావిస్తున్నారు.