విజయశాంతికి పీసీసీ చీఫ్ పదవి కావాలోమో.. అదుకే ఆమె అలా మాట్లాడుతోంది. పార్టీ కోసం విజయశాంతి ముందు ఫుల్ టైమ్ పని చేయాలి. అప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుంది.
కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం రాబోతున్నదని.. దానికి చంద్రబాబు, జగన్ తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మద్దతు ఇవ్వబోతున్నారని జగ్గారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి స్పందించిన సంగతి తెలిసిందే. జగ్గారెడ్డి వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నాయని ఆమె అన్నారు.
ఆయన వ్యాఖ్యల వల్ల… టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ మధ్య ఏదో ఒప్పందం ఉందని తెలంగాణ ప్రజలు భావిస్తారని.. అది స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని ఆమె అన్నారు. యూపీఏ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలదు. ఎవరి మద్దతూ అవసరం లేదు.. కాంగ్రెస్ ను బలోపేతం చేయాల్సిన సమయంలో.. ఇలాంటి వ్యాఖ్యలు జగ్గారెడ్డి చేయడం కరెక్ట్ కాదని.. విజయశాంతి.. జగ్గారెడ్డిపై ఫైర్ అయ్యారు.
దీంతో.. విజయశాంతి వ్యాఖ్యలపై వెంటనే జగ్గారెడ్డి స్పందించారు. విజయశాంతికి పీసీసీ చీఫ్ పదవి కావాలోమో.. అదుకే ఆమె అలా మాట్లాడుతోంది. పార్టీ కోసం విజయశాంతి ముందు ఫుల్ టైమ్ పని చేయాలి. అప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుంది. పీసీసీ చీఫ్ పదవి కావాలనుకునే వాళ్లు సొంత ఖర్చుతో పార్టీ నడపాలి.. అంటూ కాస్త ఘాటుగానే విజయశాంతి వ్యాఖ్యలకు సమాధానం చెప్పారు జగ్గారెడ్డి.
పార్టీలో కోవర్టులెవరో సమయం వచ్చినప్పుడు చెబుతా..
పార్టీలో కోవర్టులు ఉన్నారని.. వాళ్లెవరో సమయం వచ్చినప్పుడు చెబుతానని జగ్గారెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీని వీడటం.. ఉత్తమ్ వైఫల్యం కాదని.. సొంత ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారని జగ్గారెడ్డి తెలిపారు. ఉత్తమ్, కుంతియాలను ఎవ్వరూ కొనలేరని ఆయన వ్యాఖ్యానించారు.