రేవంత్ బాట‌లోకి వ‌స్తున్న జ‌గ్గారెడ్డి.. అధికారంలోకి వ‌స్తే వారి సంగ‌తి చూస్తారంట‌..

ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డికి కాంగ్ర‌స్ లో మంచి ఇమేజ్ ఉంది. కాగా ఆయ‌న ఒక‌ప్పుడు రేవంత్ కు టీపీసీ అంటేనే భ‌గ్గుమ‌నేవారు. పార్టీ కోసం ప‌నిచేసే త‌మ‌కు ఇవ్వాలని అంతేగానీ రేవంత్‌కు ఎలా ఇస్తారంటూ ఏకంగా సోనియా గాంధీని కూడా నేరుగా ప్ర‌శ్నించ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేపింది. ఇక త‌న‌లాంటి వారికి ఇస్తే పార్టీ బాగుంటుంద‌ని కూడా చెప్పారు. కానీ అనూహ్యంగా రేవంత్‌కు ప‌గ్గాలు ఇవ్వ‌డంతో దాన్ని ఆయ‌న మొద‌ట్లో పెద్ద‌గా ఒప్పుకోలేదు. కానీ రోజులు గ‌డుస్తున్నా కొద్దీ ఆయ‌న రేవంత్ దారిలోకే వ‌స్తున్నార‌ని స్ప‌స్టం అవుతోంది. ఇందుకు ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లే చెబుతున్నాయి.

jaggareddy | జగ్గారెడ్డి
jaggareddy | జగ్గారెడ్డి

ఆయ‌న కూడా సేమ్ రేవంత్ చెబుతున్న మాట‌ల‌నే వినిపిస్తున్నారు. ఈ కార‌ణంగా జ‌గ్గారెడ్డి కూడా రేవంత్ దారిలోనే న‌డుస్తున్నార‌ని కామెంట్లు చేస్తున్నారు. కాగా జ‌గ్గారెడ్డి వరంగల్ జిల్లాలో జరుగుతున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ ర్యాలీలో పాల్గొన్నారు. ఇక ఈసంద‌ర్భంగా మాట్లాడుతూ కేసీఆర్‌ను టార్గెట్ చేశారు. సీఎం కేసీఆర్ పోలీసుల‌తో త‌మ‌ను, అలాగే త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నార‌ని వాపోయారు.

ఇక కేసీఆర్ రాబోయే ఎన్నిక‌ల్లో ఓడిపోతార‌ని, ఆ విషయాన్ని పోలీసు అధికారులు మ‌ర్చిపోవ‌ద్ద‌ని తెలిపారు. అంతే కాదు ఇప్పుడు త‌మ‌ను ఇబ్బంది పెడుతున్న పోలీసుల పేర్లు రాసుకుంటామ‌ని, రాబోయే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వారి సంగ‌తి చూస్తామంటూ హెచ్చ‌రించారు. అయితే గ‌తంలో రేవంత్‌రెడ్డి కూడా ప‌దేప‌దే పోలీసులు త‌మ‌ను ఇబ్బంది పెడుతున్నార‌ని చెబుతున్నారు. వారి సంగ‌తి చూస్తామ‌ని ఆయ‌న కూడా వార్నింగ్ ఇచ‌చారు. ఇక ఇప్పుడు జగ్గారెడ్డి కూడా రేవంత్ చెప్పిన మాట‌లే వినిపించ‌డంతో ఆయ‌న క‌న్విన్స్ అయిపోయార‌ని ప్ర‌చారం సాగుతోంది.