ఈటల రాజేందర్‌ ను మించిన జమున ఆస్తులు !

-

కరీంనగర్ జిల్లా : హుజురాబాద్‌ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో నేపథ్యం లో కాంగ్రెస్‌, బీజేపీ మరియు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు నిన్న నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ హుజురాబాద్ లో ఉప ఎన్నికల ఆఫిడివిట్ లో అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలు కూడా పేర్కొన్నారు. అయితే.. ఇందులో ఈటల రాజేందర్‌ ఆస్తుల కంటే.. ఆయన సతీమణి ఈటల జమున ఆస్తులే ఎక్కువగా ఉన్నాయి. ఈటెల రాజేందర్ (బిజెపి అభ్యర్థి) మొత్తం ఆస్తుల విలువ..16.12 కోట్లు కాగా… చర స్థిర ఆస్తులు..16.12 కోట్లు ఉన్నాయి. అలాగే ఈటల రాజేందర్‌ కు సొంత వాహనము లేదని ఆఫిడవిట్‌ లో పేర్కొన్నారు.


బలుమూరి వెంకట్ (కాంగ్రెస్ అభ్యర్థి) మొత్తం ఆస్తులు విలువ..59,51,086 కాగా… రూ. 14 లక్షలు విలువ చేసే ఒక సఫారీ స్టార్మ్ కారు, 462 గ్రాముల ఆభరణాలు ఉన్నాయని తెలిపారు. అలాగే.. గెల్లు శ్రీనివాస్ (టి ఆర్‌ఎస్ అభ్యర్థి) మొత్తం ఆస్తులు విలువ రూ. 22 లక్షలు కాగా.. చర స్థిర ఆస్తులు విలువ రూ. 22,82,402లక్షలు గా ఉంది. గెల్లు శ్రీనివాస్‌ కు సొంత వాహనము లేదు.

ఇక ఈటెల జమున మొత్తం ఆస్తుల విలువ..రూ. 43 కోట్లు కాగా… డిపాజిట్ లు రూ. 28.68 కోట్లు ఉన్నాయి. అలాగే… స్థిరాస్తులు..రూ14.78 కోట్లు ఉండగా… 1500 గ్రాముల ఆభరణాలు ఉన్నాఇయ. అంతేకాదు.. మూడు ఇన్నోవా, సీఆర్వీ వాహనాలు, క్రిస్ట ఉన్నాయి. కాగా.. సెంటీమెంట్‌ గా ఈటల తో పాటు ఆయన సతీమణి జమున నామినేషన్‌ వేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news