హైదరాబాద్ లో భారీ వర్షాలు : సినిమా థియేటర్‌లో 50 బైక్‌లు ధ్వంసం..

హైదరాబాద్‌ మహానగరంలో నిన్న రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ లోని అన్ని ఏరియాల్లోనూ వర్షాలు కురిశాయి. దీంతో వందల కాలనీలు మునగడంతో పాటు… రోడ్ల పైకి భారీగా వరద నీరు వచ్చింది. దీంతో పలు ప్రాంతాల్లో విపరీతంగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. అయితే.. ఈ భారీ వర్షాలు దిల్‌ సుఖ్‌ నగర్‌ ను కూడా ముంచెత్తాయి.

ఈ నేపథ్యం లోనే శివ గంగ థియేటర్‌ కాంపౌండ్‌ వాల్‌ లోకి భారీ గా వరద నీరు పోటెత్తడంతో కాంపౌండ్‌ వాల్‌ కూలిపోయింది. ఆ గోడ వెంట పార్కింగ్‌ చేసిన 50 బైక్‌ లు ధ్వంసం అయ్యాయి. సినిమా ఫస్ట్‌ షో సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రేక్షకుల బైకులపై కాంపౌండ్‌ వాల్‌ పడటంతో వాహనాలన్నీ నుజ్జు నుజ్జుయ్యాయి. దాదాపు 50 బైకులు ధ్వంసం అయ్యాయి. దీంతో థియేటర్‌ యాజమాన్యంపై వాహన దారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు థియేటర్‌ యాజమాన్యం పై ఈ ఘటన పై ఏ మాత్రం స్పందించలేదు.