సైడ్ అవుతున్న జానారెడ్డి…వారసుడు లైన్ అవుతారా?

కుందూరు జానారెడ్డి ( Jana Reddy )….రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. దశాబ్దాల పాటు ఉమ్మడి ఏపీలో రాజకీయాలు చేసిన నాయకుడు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన జానారెడ్డి…1983, 1985 ఎన్నికల్లో టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో విభేదించి కాంగ్రెస్‌లోకి వచ్చేశారు. 1989, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే మంత్రి కూడా పలుమార్లు పనిచేశారు.

jana reddy | జానారెడ్డి
jana reddy | జానారెడ్డి

ఇక 2018 ఎన్నికల్లో జానారెడ్డి ఓటమి పాలయ్యారు. ఇటీవల జరిగిన నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కూడా జానారెడ్డి ఓడిపోయారు. ఈ ఓటమితో జానారెడ్డి రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండటం తగ్గించేశారు. ఇప్పటికే జానారెడ్డి రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది.

అలాగే ఇటీవల ఉపఎన్నిక సమయంలోనే…ఇవే తనకు చివరి ఎన్నికలని, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసే అవకాశం లేదని కూడా జానారెడ్డి చెప్పేశారు. అయితే అనుహ్యాంగా ఉపఎన్నికలో జానారెడ్డి ఓడిపోవడం, రాజకీయాలకు దూరమవ్వడం ఒక్కసారే జరిగినట్లు తెలుస్తోంది. ఓడిపోయిన దగ్గర నుంచి జానారెడ్డి పార్టీలో కనిపించడం లేదు.

తాజాగా ఇంద్రవెల్లిలో భారీ సభ జరిగిన జానారెడ్డి, ఆ సభకు హాజరు కాలేదు. అయితే వయసు మీద పడటంతోనే జానారెడ్డి యాక్టివ్ పాలిటిక్స్ చేయలేకపోతున్నారని తెలుస్తోంది. ఇక జానారెడ్డి వారసుడు రఘువీర్ రెడ్డి లైన్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్ బాధ్యతలని రఘువీర్ రెడ్డి చూసుకుంటారని ప్రచారం జరుగుతుంది.

త్వరలోనే జానారెడ్డి అధికారికంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించనున్నారని, ఆ తర్వాత నుంచి రఘువీర్ రెడ్డి యాక్టివ్ కానున్నారని తెలుస్తోంది. మొత్తానికైతే జానారెడ్డి మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ చేయడం కష్టమే అని చెప్పొచ్చు.