విజయవాడ వెస్ట్‌లో వెల్లంపల్లిపై జనసేన పోటీ?

-

అధికార వైసీపీకి ధీటుగా ప్రతిపక్ష టి‌డి‌పి కూడా రాజకీయం నడిపిస్తున్న విషయం తెలిసిందే. వైసీపీతో ఢీ అంటే ఢీ అనేలా టి‌డి‌పి నేతలు ముందుకెళుతున్నారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి జనసేన గట్టి పోటీ ఇస్తుంది. ఇలాంటి నియోజకవర్గాల్లో టి‌డి‌పి సైలెంట్ గా ఉంటుంది. అలా వైసీపీ-జనసేనల మధ్య పోరు నడుస్తున్న సీట్లలో విజయవాడ వెస్ట్ కూడా ఒకటి. ఇక్కడ వైసీపీ తరుపున మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఉన్నారు.

ఈయనకు ధీటుగా జనసేన రాజకీయం నడుపుతుంది. జనసేన నుంచి పోతిన మహేష్ దూకుడుగా ఉంటున్నారు. వెల్లంపల్లితో ఢీ అంటే ఢీ అనేలా ఉంటున్నారు. వెల్లంపల్లి..పవన్ పై విమర్శలు చేస్తే వెంటనే పోతిన కౌంటర్లు ఇచ్చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పుట్టినరోజు ఆగస్టు 15 కాదని.. ఆగస్టు 9 అని, కానీ ఆగష్టు 15 అన్నట్లు హడావిడి చేస్తున్నారని, వెల్లంపల్లి వ్యవహారం చూస్తుంటే బ్రహ్మానందం దీపావళి పండగను వినాయక చవితి రోజున చేసుకున్న పెళ్లి చేసుకుందాం సినిమా సీను గుర్తొస్తుంది అంటూ ఎద్దేవా చేశారు.

ఇలా వెల్లంపల్లికి ప్రతి విషయంలో పోతిన కౌంటర్ ఇస్తున్నారు. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ లో పోటీ చేసి వెల్లంపల్లికి చెక్ పెట్టాలని పోతిన చూస్తున్నారు. ఇక్కడ టి‌డి‌పి పెద్దగా యాక్టివ్ గా లేదు. సమన్వయకర్తగా ఎంపీ కేశినేని నాని ఉన్నారు..కానీ ఆయన పెద్దగా నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదు.

అలాగే టి‌డి‌పి నేతలు జలీల్ ఖాన్, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా ఈ నియోజకవర్గంలోనే ఉన్నారు. సీటు కోసం రచ్చ చేస్తున్నారని చంద్రబాబు, కేశినేనికి బాధ్యతలు ఇచ్చారు. ఇక పొత్తు ఉంటే ఈ సీటు జనసేనకు ఇచ్చేయాలని బాబు చూస్తున్నారు. ఇక టి‌డి‌పి సపోర్ట్ తో ఇక్కడ జనసేన నుంచి పోతిన పోటీ చేసే ఛాన్స్ ఉంది. గత ఎన్నికల్లో వెల్లంపల్లి టి‌డి‌పిపై 7 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు..జనసేనకు 25 వేల ఓట్లు వరకు వచ్చాయి. అంటే టి‌డి‌పి-జనసేన కలిస్తే వెల్లంపల్లికి రిస్క్ తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news