జనసేన అత్యవసర సమావేశం…?

Join Our Community
follow manalokam on social media

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలను ఇబ్బంది పెడుతుంది. బిజెపి ఏపీలో ఏ విధంగా కూడా బలంగా లేదు. ఇక బలపడాలని భావిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో ప్రత్యేక హోదా విషయంలో చేసిన ప్రకటనలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇక రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్లే పార్టీలు కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది.

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. బీజేపీ కారణంగా నష్టపోతున్నాము అనే భావనలో ఉన్న పవన్ కళ్యాణ్ త్వరలోనే ఆ పార్టీకి గుడ్బై చెప్పడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి జనసేన పార్టీ నేతలతో ఆయన వచ్చే వారంలో ఒక కీలక సమావేశం నిర్వహించి దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ఇప్పటికే పార్టీ నేతలకు పవన్ కళ్యాణ్ ఒక సమాచారాన్ని కూడా పంపించారని విజయవాడలో ఈ సమావేశం జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ సమావేశంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు కూడా పాల్గొనే అవకాశాలున్నాయని సమాచారం. అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ బీజేపీ విషయంలో ఒక కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనబడుతున్నాయి.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...