కేటీఆర్ నాతో పెట్టుకోవద్దు… నేను శపించానంటే అంతే: కేఏ పాల్ వార్నింగ్

-

కేటీఆర్ చూశావు కదా. శ్రీలంకలో బాంబు పేలుళ్ల తర్వాత ఎవరినీ ఎక్కడికీ పంపించలేదు. ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోయారు. కానీ.. నేను మాత్రం.. ఏకంగా శ్రీలంక ప్రధాని ఇంటికే వెళ్లగలిగాను. శ్రీలంక ప్రెసిడెంటే నన్ను ప్రధాని ఇంటికి తీసుకెళ్లి.. టీ, కాఫీలిచ్చి.. భోజనం పెట్టి పంపించారు.

KA Paul fires on trs working president ktr

నేను హైదరాబాద్ వచ్చానని కేసీఆర్ కు, కేటీఆర్ కు నిద్రపట్టడం లేదు. తెలంగాణకు నేను మద్దతిచ్చా. కేసీఆర్ నా దగ్గరకు వచ్చారు. నేనంటే కేసీఆర్ కు చాలా ప్రేమ. నా గురించి నీకు తెలియదు కేటీఆర్. కావాలంటే నీనాన్నను అడుగు నా గురించి చెబుతాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నీకు డబ్బు బాగా ఎక్కువైపోయినట్లుంది. నాతో పెట్టుకోవద్దు కేటీఆర్. నేను కాంగ్రెస్ పార్టీని కాదు కొనేయడానికి. కోదండరాంను అస్సలు కాదు. కేఏ పాల్.. ప్రపంచాన్ని షేక్ చేసిన కేఏ పాల్. ప్రపంచాన్నే ఓడించి గెలిసొచ్చిన వాడిని. నన్నేమీ చేయలేవు.. అంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏపీకి చెందిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫైర్ అయ్యారు.

మరోవైపు ప్రధాని మోదీని, ఏపీ సీఎం చంద్రబాబును, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ ను కూడా కేఏ పాల్ వదల్లేదు. వాళ్లపై కూడా విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల సమయంలో తనను చంపేందుకు కుట్ర జరిగిందని… ఎన్నికల సంఘం అధికారులు కానీ… సీఎం చంద్రబాబు కానీ.. తనకు సెక్యూరిటీ కల్పించలేదని వాపోయారు. ఆధారాలు సమర్పించినా పట్టించుకోలేదన్నారు. మోదీ, చంద్రబాబు, జగన్.. ఈ ముగ్గురూ తనకు శత్రువులని కేఏ పాల్ స్పష్టం చేశారు. అయితే.. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం తనకు మిత్రుడో.. శత్రువో అర్థం కావడం లేదన్నారు.

ఎన్నికల ముందు వరకు కేసీఆర్ తనకు మంచి మిత్రుడన్నారు. అయితే.. కేసీఆర్ కేవలం ఫాంహౌస్ కు పరిమితమయ్యారని.. కేటీఆర్ మాత్రం తనపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని.. తనపై ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు చేసే ఊరుకునేది లేదని పాల్ హెచ్చరించారు.

బాంబు పేలుళ్ల తర్వాత శ్రీలంక ప్రధానితోనే భేటీ అయ్యేంత కెపాసిటీ నాది..

కేటీఆర్ చూశావు కదా. శ్రీలంకలో బాంబు పేలుళ్ల తర్వాత ఎవరినీ ఎక్కడికీ పంపించలేదు. ఎక్కడి వాళ్లు అక్కడే ఉండిపోయారు. కానీ.. నేను మాత్రం.. ఏకంగా శ్రీలంక ప్రధాని ఇంటికే వెళ్లగలిగాను. శ్రీలంక ప్రెసిడెంటే నన్ను ప్రధాని ఇంటికి తీసుకెళ్లి.. టీ, కాఫీలిచ్చి.. భోజనం పెట్టి పంపించారు. ఆ దేశానికి నేను ఎంతో సేవ చేశాను. ఆర్థిక సాయం చేశాను. ఇతరులతో చేయించాను. నేను ఓ దేశానికి లాభం చేశా. మరి.. తెలంగాణకు కేసీఆర్, కేటీఆర్ చేసిందేముంది. వాళ్లు కట్టారా తెలంగాణను.. లేక చంద్రబాబు కట్టారా? వందల మంది కోటీశ్వరులను నేను హైదరాబాద్ కు తీసుకొచ్చా. బిల్ క్లింటన్, బిల్ గేట్స్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చిందీ నేనే. నాతో నీకెందుకు గొడవ. నేనేమన్నా మందకృష్ణ మాదిగను అనుకుంటున్నావా ఏంది. నేను శపించానంటే అంతే.. నువ్వు మసై పోతావు.. జాగ్రత్త అంటూ కేటీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news