రాజకీయాల్లోకి కంగనా…? నిజమేనా…?

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం కొన్ని రోజుల నుంచి జరుగుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగనా రనౌత్ చేస్తున్న విమర్శలు ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఉండటంతో ఆమె బిజెపిలో చేరే అవకాశాలు ఉన్నాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అవ్వచ్చు అంటూ జాతీయ మీడియా కొన్ని కథనాలు ప్రసారం చేసింది.

ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే స్పందించారు. ఇటీవల కంగనా రనౌత్ తన ముంబై నివాసంలో కలిసా అని ఆమె రాజకీయాల్లోకి రావాలి అనుకుంటే బీజేపీ లేదా తన పార్టీలోకి కంగనా కు స్వాగతం పలుకుతామని ఆయన పేర్కొన్నారు. కానీ కంగనారనౌత్ మాత్రం రాజకీయాలపై ఆసక్తి లేదు అని చెప్పినట్టు వివరించారు. కాగా కంగనా రనౌత్ కి వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించినందుకు గాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కి కంగనా రనౌత్ తల్లి ధన్యవాదాలు తెలిపారు.