ఈట‌ల‌పై క‌రీంన‌గ‌ర్ మంత్రుల ఆరోప‌ణ‌లు.. అంతా ప్లాన్ ప్ర‌కార‌మేనా!

ఈట‌ల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు నోరు మెద‌ప‌ని టీఆర్ ఎస్ మంత్రులు ఎట్ట‌కేల‌కు స్పందించారు. మ‌రీ ముఖ్యంగా అండ‌గా ఉంటార‌నుకున్న ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ మంత్రులే ఆయ‌న‌పై మండి ప‌డుతున్నారు. ఈట‌ల త‌ప్పు చేశారంటూ నిందిస్తున్నారు. కేసీఆర్ కు జై కొట్టారు. దీంతో అస‌లు ఈట‌ల రాజేంద‌ర్ కు స‌పోర్టుగా ఎవ‌రూ వ‌చ్చేలా లేర‌ని కన‌పిస్తోంది.

నిన్న‌టి వ‌ర‌కు మౌనంగా ఉన్న నేత‌లు.. ఇప్పుడు స్వ‌యంగా ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఈట‌ల కోర్టుకు వెళ్లేదాకా ఆగి మ‌రీ కౌంట‌ర్లు వేస్తున్నారు. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా మంత్రులు కొప్పుల ఈశ్వ‌ర్‌, గంగుల క‌మ‌లాక‌ర్ ఈట‌ల‌ను టార్గెట్ చేసి ఆరోప‌ణ‌లు చేశారు. కొప్పుల మాట్లాడుతూ.. ఈట‌ల‌కు గౌర‌వం ఇవ్వ‌లేద‌న్న‌ది అబ‌ద్ధం అన్నారు. అసైన్డ్ భూముల కొన‌డం త‌ప్పుకాదా అని ప్ర‌శ్నించారు దేవ‌ర‌యాంజాల్ లో దేవుని భూములు కొన‌డం కూడా త‌ప్పేన‌ని వ్యాఖ్యానించారు.

ఇక గంగుల క‌మ‌లాక‌ర్ కూడా ఈట‌ల‌పై మాట‌ల తూటాలు పేల్చారు. ఈట‌ల బీసీ దొర అంటూ సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ఈట‌ల ముదిరాజులు, బీసీల గురించి ఏ రోజూ ఆలోచించ‌లేద‌ని మండి ప‌డ్డారు. ఆయ‌న పార్టీలోకి రాక‌ముందే క‌మ‌లాపురం జ‌డ్పీ పీఠం గెలిచామ‌ని చెప్పారు. పార్టీ ఓడితే ఈట‌ల న‌వ్వేవారని, గెలిస్తే ఏడ్చేవారంటే కామెంట్ చేశారు. దీంతో క‌రీంన‌గ‌ర్ నేత‌లు ఈట‌ల‌ను ఒంట‌రి చేశార‌ని తెలుస్తోంది.