kashmir files: సినిమా కోసం ప్రభుత్వ ఉద్యోగులకు లీవ్… కాశ్మీర్ ఫైల్స్ కోసం మరో రాష్ట్ర నిర్ణయం

-

దేశంలో ప్రస్తుతం ‘ది కాశ్మీర్ ఫైల్స్’ పేరు మారుమోగుతోంది. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. 1990ల్లో కాశ్మీర్ పండిట్లు ఎదుర్కొన్న ఇబ్బందులు, అత్యాచారాాలు, ఓ వర్గం సాగించిన దమనకాండ, వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. వివేక్ అగ్రిహోత్రి దర్శకత్వంలో ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదలైంది. కాశ్మీర్ లో పండిట్లు ఎదుర్కొన్న ఇబ్బందులు, తన ఇళ్లు, స్థలాలు విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం వంటి అంశాలు ప్రేక్షకులతో కంటతడిపెట్టిస్తున్నాయి. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవరిలు ప్రధాన పాత్రలు పోషించారు.

ఇదిలా ఉంటే కాశ్మీర్ పైల్స్ కోసం గోవా, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు టాక్స్ ఫ్రీని ప్రకటించాయి. ఇటీవల మధ్య ప్రదేశ్ గవర్నమెంట్ ఆ రాష్ట్ర పోలీసులు కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూసేందుకు ఒక రోజు సెలవు మంజూరు చేస్తామని ప్రకటించింది. ఇదిలా ఉంటే అస్సాం ప్రభుత్వం కూడా ‘ ది కాశ్మీర్ ఫైల్స్ ’ సినిమా కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్ డే సెలవు మంజూరు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. సినిమాకు వెళ్లిన ఉద్యోగులు తమ ఉన్నతాధికారులకు మరుసటి రోజు టికెట్లు చూపిస్తే సరిపోతుందని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ట్విట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news