మంత్రిగా కేసీఆర్‌ తనయ కవిత.. అందుకే ఆ నేతకు కీలక పదవి?

-

రాజకీయాల్లో ప్రతీది గేమ్ అని చాలా మంది అంటుంటారు. ప్రత్యర్థులతో పాటు సొంత వారికి కూడా అర్థం కాని వ్యూహాలు వేయగలిగిన వారే రాజకీయాల్లో ఎక్కువ కాలం పాటు మనగలుగుతారని పెద్దలు చెప్తుంటారు. ఇకపోతే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వ్యూహకర్తగా మంచి పేరుంది. మాస్టర్ మైండ్‌తో కేసీఆర్ చేసే ప్లానింగ్స్ ప్రత్యర్థులకు అంత త్వరగా అస్సలే అర్థం కావు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

కాగా తాజాగా ఓ జిల్లాకు చెందిన సీనియర్ నేతకు అప్పజెప్పిన పదవిని చూస్తుంటే రానున్న రోజుల్లో గులాబీ పార్టీ బాస్ సరికొత్త సమీకరణాల దిశగా అడుగులు వేయబోతున్నారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇంతకీ ఆ నేత ఎవరంటే.. నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ను ఆర్టీసీ చైర్మన్‌గా నియమించారు.

చాలా రోజుల నుంచి ఆ పదవిని ఖాళీగానే ఉంచిన కేసీఆర్ అనూహ్యంగా ఆ పదవిని బాజిరెడ్డి కట్టబెట్టడం వెనుక ఓ ఆలోచన ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. అదేంటంటే.. ఇందూరు జిల్లా నుంచి ఆల్రెడీ కేసీఆర్ తనయ శాసన మండలి సభ్యురాలిగా ఉంది. త్వరలోనే ఆమెను మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచన ఉండగా, ఒకవేళ అలా చేస్తే ఆ జిల్లా నుంచి సీనియర్‌గా ఉన్న బాజిరెడ్డిని కాదని కవితకు మంత్రి పదవి ఇస్తే బాజిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసే చాన్సెస్ ఉంటాయని అనుకున్నారట.

ఈ క్రమంలోనే ఆయన్ను ఆర్టీసీ చైర్మన్ పదవిలో కూర్చొబెట్టారని టాక్. ఇలా చేయడం ద్వారా కవితను మంత్రివర్గంలోకి తీసుకోవాలని డెసిషన్‌కు అడ్డు ఎవరు ఉండబోరని కేసీఆర్ ప్లాన్ అని తెలుస్తోంది. అయితే, చాలా కాలం నుంచి కవితను మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ఊహాగానాలు ఉన్నాయి. చూడాలి మరి.. కేసీఆర్ నిజంగానే ఆయన తనయను మంత్రి చేస్తారో లేదో మరి..

Read more RELATED
Recommended to you

Latest news