రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్న కేసీఆర్ భేటీ

-

ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ బిజీబిజీగా ఉన్నారు. కేంద్ర పెద్దలతో వరస భేటీలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఒకే నెలతో రెండుసార్లు కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. తాజాగా హోం శాఖ సమావేశం కోసం దేశ రాజధానికి వెళ్లిన సీఎం కేసీఆర్ కేంద్రహెం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు మరో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తో సమావేశం అయ్యారు. హుజూరాబాద్ ఎన్నికల ముందు వరసగా రెండుసార్లు బీజేపీ పెద్దలను కేసీఆర్ కలుసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర బీజేపీ వర్గాలు ఈభేటీలు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అని కలవరపడుతున్నారు. రాష్ట్రంలో మాత్రమే బీజేపీ, టీఆర్ఎస్ మధ్యలో పోటీ ఉంది కానీ ఢిల్లీలో రెండు పార్టీలకు సత్సంబంధాలు ఉన్నాయనే అభిప్రాయాలు ఉన్నాయనే చెడు సంకేతాలు హుజూరాబాద్ ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని ప్రజలు భావించే అవకాశం లేకపోలేదు. అయితే హుజూరాబాద్ బరిలో ఉన్న బీజేపీ మాత్రం ఇవన్ని కేవలం మర్యాదపూర్వక భేటీలు మాత్రమే అని రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యమ్నాయం ఎప్పటికీ బీజేపే అని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. హుజూరాబాద్లో గెలిచేది బీజేపే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news