గులాబ్ తుఫాన్ ధాటికి ఉత్తరాంధ్ర కంపించింది. ఆదివారం రాత్రి 9-10 గంటల మధ్యలో తీరం దాటింది. తీరం దాటే సమయంలో వెళ్తూ వెళ్తూ తీవ్ర నష్టాన్ని కలిగించింది. తీరం దాటే సమయంలో గంటకు 75- 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ అల్లకల్లోలం కలిగించింది. తుఫాన్ ప్రమాదంతో విజయంనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం మూడు జిల్లాల్లో తీవ్ర నష్టం ఏర్పడింది. ఈ మూడు జిల్లాల్లో తీవ్రమైన భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు, హెర్డింగ్లు విరిగిపడ్డాయి. మరోవైపు ఒడిషాలోని 10 జిల్లాలు తుఫాను తీవ్రతకు గురయ్యాయి. మరో 24 గంటల వరకు తీవ్రమైన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్ ప్రభావంతో ఉత్రరాంధ్ర, దక్షిణ ఒడిషాలపై తీవ్రమైన వాయుగుండం ఏర్పడింది. ప్రజలు అందరూ ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం కోరింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి, ప్రభుత్వం సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆఎఫ్ బలగాలు క్షేత్రస్థాయిలో ఉండీ సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది.
కంపించిన ఉత్తరాంధ్ర.. ఆ మూడు జిల్లాలకు ప్రమాదం
-