కేసీఆర్ దారిలోనే ఈట‌ల‌.. ఇలాంటివి కూడా న‌మ్ముతారా?

ఇప్పుడు తెలంగాణ‌లో ఈట‌ల రాజేంద‌ర్ రాజ‌కీయం మాత్ర‌మే నడుస్తోంది. ఆయ‌న తీసుకునే నిర్ణ‌యం కోసం తెలంగాణ మొత్తం ఎదురు చూస్తోంది. ఆయ‌న విప‌క్ష పార్టీల నేత‌ల‌ను నిత్యం క‌లుస్తూ అంద‌రికీ షాక్ ఇస్తున్నారు. కానీ ఏపార్టీలో చేర‌తార‌నేది మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు. అయితే ఇప్పుడు బీజేపీలోచేర‌తార‌నేది దాదాపు ఖాయ‌మైపోయిన‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో కేసీఆర్‌ను ఆయ‌న ఫాలో అవుతున్న‌ట్టు స‌మాచారం.

 

ఇప్పుడున్న గ‌డ్డు పరిణామాల నుండి ఉపశమనం పొందేందుకు, రాబోయే రోజుల్లో త‌న రాజకీయ భవిష్యత్తు మంచిగా ఉండేందుకు ఈట‌ల కూడా కేసీఆర్‌లాగే పూజ‌ల‌ను న‌మ్ముకుంటున్నారు. ఏదైనా ప‌నిచేసే ముందు కేసీఆర్ పూజ‌లు, యాగాలు చేస్తారు. ఇప్పుడు ఈట‌ల కూడా వీటిని బలంగా న‌మ్ముతున్నారు.

వేరే పార్టీలో చేరేముందు అంతా మంచి జ‌ర‌గాల‌ని ఆరుగురు పండితులతో రోజూ యాగాలు, పూజలు చేస్తున్నారు ఈట‌ల‌. శాంతి పూజలతో పాటు శత్రువుల నుండి రక్షణ కోసం శత్రు సంహారక, దోష నివారణ పూజలు చేయిస్తోంది ఈట‌ల కుటుంబం. ఇందుకోసం ఈట‌ల మూడు రోజులుగా ఉదయం 3 గంటల నుంచి 7 గంటల వరకు ఇంట్లోనే ఉండి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి పూజ‌లు చేస్తున్నారు. మ‌రి ఆయ‌న పూజ‌లు ఏ మేర‌కు ఫ‌లిస్తాయో చూడాలి.