గుడ్ న్యూస్; ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కెసిఆర్…!

-

ఆర్టీసి సమ్మె ముగింపు సందర్భంగా తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చారు. ఆయన సూచనతో తెలంగాణా ఆర్టీసీలో వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ డిపోలో ఇద్దరు కార్మికుల చొప్పున 202 మందిని ఎంపిక చేసారు. ఈ సంక్షేమ మండళ్ళు అన్ని కూడా డిపో మేనేజర్ల ఆధ్వర్యంలో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నారు.

యూనియన్ల విషయంలో ఆగ్రహంగా ఉన్న కెసిఆర్, వాటి స్థానంలో సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేస్తామని, వాటి ద్వారా కార్మికుల సమస్యలను ఈ బోర్డులు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాయని కెసిఆర్ వెల్లడించారు. ఈ వెల్ఫేర్ బోర్డులు డిపో, రీజియన్, జోనల్, కార్పొరేషన్ స్థాయి సమస్యలను పరిష్కరి౦చనున్నాయి. సమస్యలలు తెలుసుకోవడానికి గాను,

ప్రతి డిపోలో ఈ-బాక్స్ అంటే ఎంప్లాయిస్ బాక్స్ ని ఈ మండళ్ళు ఏర్పాటు చేయగా… వాటిలో ఆర్టీసి ఉద్యోగులు తమ సమస్యలను లేఖ రూపంలో కాగితంపై రాసి వెయ్యాల్సి ఉంటుంది. ప్రతీ రోజు వాటిని తెరిచి, డిపో స్థాయిలో సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించి, సమాచారాన్ని ఉద్యోగికి అందిస్తారు. రీజియన్, జోన్, కార్పొరేషన్ పరిధిలో సమస్యల్ని ఉన్నతాధికారులకు తెలియజేయనున్నారు.

వారానికి ఒకసారి డిపో మేనేజర్ల ఆధ్వర్యంలో సంక్షేమ మండళ్లు సమావేశం నిర్వహించి వేతనాలు, అలవెన్సులు, సెలవులు, రీఎంబర్స్ మెంట్ వంటి సమస్యలు మండళ్ల పరిధిలో పరిష్కరించే విధంగా అడుగులు వేస్తారు. నెలకు ఒకసారి రీజినల్ మేనేజర్లు సమావేశాలు నిర్వహించి, వెల్ఫేర్ బోర్డుల సభ్యులు, డివిజనల్ మేనేజర్లు, పర్సనల్ ఆఫీసర్లు, అకౌంట్ ఆఫీసర్లు పాల్గొని రీజియన్ స్థాయి సమస్యలను పరిష్కరించే చొరవ చూపుతారు. ప్రధానంగా ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు, సీనియారిటీ జాబితాల తయారీ వంటివి పరిశీలించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news