వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోపై జగన్ కీలక నిర్ణయం

-

వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోపై దృష్టి కేంద్రీకరించారు జగన్. ఎన్నికల మేనిఫెస్టో.. రొడ్డకొట్టుడులా కాకుండా.. ఖచ్చితత్వంతో రూపొందించాలని మేనిఫెస్టో కమిటీతో చెప్పారు. మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై ఆయన మేనిఫెస్టో కమిటీతో చర్చించారు.

రోజు రోజుకూ ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో డేటా చోరీ స్కామ్‌పై రాజకీయ పార్టీలు ఒకరి మీద మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. అయితే.. టీడీపీనే కావాలని వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తీసేస్తోందని వైఎస్ జగన్ ఆరోపిస్తున్నారు. దాని కోసం తెర తీసిన స్కామే డేటా చోరీ అంటూ ఆయన టీడీపీపై నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే.

మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోపై దృష్టి కేంద్రీకరించారు జగన్. ఎన్నికల మేనిఫెస్టో.. రొడ్డకొట్టుడులా కాకుండా.. ఖచ్చితత్వంతో రూపొందించాలని మేనిఫెస్టో కమిటీతో చెప్పారు. మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై ఆయన మేనిఫెస్టో కమిటీతో చర్చించారు. అధికారం కోసం నెరవేర్చలేని హామీలను కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నెరవేర్చగలిగే హామీలనే మేనిఫెస్టోలో చేర్చాలని జగన్ తేల్చి చెప్పారు. ఇతర పార్టీలతో తమకు సంబంధం లేదని.. తాము ప్రకటించే మేనిఫెస్టోలో వందకు వంద శాతం హామీలు అమలయ్యేవే.. అది కూడా ప్రజలకు ఉపయోగపడే హామీలే ఉండాలని జగన్ స్పష్టం చేశారు.

అంతే కాదు.. మేనిఫెస్టో ద్వారా ఇచ్చే హామీలకు సంబంధించిన ఆర్థిక భారంపై కూడా బేరీజు వేసుకోవాలని జగన్ సూచించారు. పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యలను మాత్రం ఖచ్చితంగా మేనిఫెస్టోలో పెట్టాలని జగన్ కమిటీకి సూచించారు. అలాగే… మేనిఫెస్టో పేజీలకు పేజీలు వద్దని.. ప్రతి ఏపీ పౌరుడికి అర్థమయ్యే విధంగా మేనిఫెస్టోను తయారు చేయాలని జగన్ చెప్పారు. ఇలా.. వైసీపీ మేనిఫెస్టోలో వినూత్నత పాటిస్తూ రూపొందిస్తుండటంతో మేనిఫెస్టోలో ఏయే కీలక అంశాలు ఉండనున్నాయోనని ఏపీ ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version