మరో నేతకు తాంబూలం ఇవ్వడానికి వైసీపీ రెడీ…?

Join Our Community
follow manalokam on social media

విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే మాత్రం కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిణామాలు ఉంటాయి. అయితే ఇప్పుడు కీలక నేతలు అధికార వైసీపీ టార్గెట్ చేస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గంటా శ్రీనివాసరావుకి అత్యంత సన్నిహితంగా ఉండే ఒక నేతకు నిన్న వైసీపీ కండువా కప్పారు.

ఇప్పుడు మరో నేత మీద అధికార వైసీపీ దృష్టి పెట్టింది. గంటా శ్రీనివాసరావుతో అత్యంత సన్నిహితంగా ఉండే ఒక వ్యాపారవేత్త మీద విశాఖ జిల్లాలో దృష్టిపెట్టినట్లు గా సమాచారం. ఉత్తర నియోజకవర్గ పరిధిలో ఉండే సదరు నేతను ఖచ్చితంగా పార్టీలోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. ఆయనతో ఇప్పటికే విజయసాయిరెడ్డి తో పాటు విశాఖ ఎంపీ సత్యనారాయణ కూడా మాట్లాడారని ఆయన కూడా పార్టీలోకి రావడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీలో ఉండి ఇబ్బందులు పడుతున్న సదరు నేతను ఇప్పుడు పార్టీలోకి తీసుకొచ్చి మంచి పదవి కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. అవసరం అయితే వచ్చే ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి మీకు సీటు ఇస్తామని కూడా సదరు నేతకు విజయసాయిరెడ్డి ఆఫర్ ఇచ్చారట. మరి ఆయన పార్టీ మారతారా లేదా అనేది వచ్చే వారం రోజుల్లో స్పష్టత రానుంది.

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...