
విశాఖ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఇటీవల నక్సల్స్ చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు సతీమణి పరమేశ్వరి నిరసన వ్యక్తంచేశారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద ఆమె ఆందోళన చేపట్టారు. ఆమె దీక్షకు ఈపీడీసీఎల్ డైరెక్టర్ శోభా హైమావతి, తెలుగు మహిళా సంఘం నేతలు సంఘీభావం తెలిపారు. తెదేపాలోకి వెళ్లిన వైకాపా ఎమ్మెల్యేను చంపింది గోదావరి జిల్లా నుంచి నక్సలిజంలోకి వెళ్లిన ఆడపడుచు.. ఆమె ఎందుకు అటువైపు వెళ్లిందో ఆలోచించుకోవాలని పవన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, తన భర్త హత్యకు గురై నెల కూడా కాకముందే ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలుచేయడం తమనెంతగానో బాధించిందని .. కిడారి గురించి ప్రజలందరికీ తెలుసని ఆమె తెలిపారు. తమకు ధైర్యం ఇవ్వాలి తప్ప ఇలాంటి వ్యాఖ్యలతో బాధపెట్టొద్దని ఆమె కోరారు.