ఈటల రాజేందర్ చుట్టూ ఇప్పుడు హాట్ పాలిటిక్స్ నెలకొన్నాయి. మొన్నటి వరకు ఆయన ఏ పార్టీలో
చేరతారో అని అంతా ఆసక్తిగా ఎదరుచూశారు. వరుసగా కాంగ్రెస్, బీజేపీ నేతలను కలవడంతో గందరగోళం నెలకొంది. కానీ ఫైనల్‌గా ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన నిన్న ఢిల్లీ కూడా వెళ్లారు.
అయితే ఆయన బీజేపీలో చేరడం దాదాపు ఖాయమేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈటల బీజేపీలో చేరడం ఖాయమేనంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తనను కలిసి మాట్లాడిన తర్వాతే ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లారని స్పష్టం చేశారు.
అక్కడ ఈటల జేపీ నడ్డాను కలుస్తారన్నారు.ఇక ఈటల రాకను వ్యతిరేకిస్తున్న సీనియర్ నేత, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డిపై కిషన్‌రెడ్డి స్పందించారు. ప్రతి పార్టీలో అసంతృప్తులు సహజమని.. కానీ అవే ఫైనల్ కాదని స్పష్టం చేశారు. అవన్నీ పార్టీ అంతర్గత వ్యవహారాలని, వాటిని పరిష్కరించుకుంటామని వెల్లడించారు.