తెలంగాణ రాజకీయాల్లో కొండా ఫ్యామిలీకంటూ ప్రత్యేక స్థానం ఉన్న విషయం తెలిసిందే. దశాబ్దాల పాటు వరంగల్ జిల్లాలో కీలకంగా పనిచేస్తున్న కొండా ఫ్యామిలీ గత కొన్నేళ్లుగా రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఎదురుకుంటుంది. ఆ ఫ్యామిలీకి సరైన గెలుపు రావడం లేదు. ఎప్పుడైతే కొండా సురేఖ…జగన్ వెంట నడిచిందో …అప్పటినుంచే రాజకీయం మారిపోయింది. పరకాల ఉపఎన్నికలో ఓడిపోవడం దగ్గర నుంచి రాజకీయంగా ఇబ్బందులు వచ్చాయి.
అయితే తెలంగాణలో వైసీపీ పూర్తిగా కనుమరుగు కావడంతో..సురేఖ టీఆర్ఎస్‌లోకి వచ్చారు…2014లో వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ టీఆర్ఎస్‌లో కొండా ఫ్యామిలీకి పూర్తి స్వేచ్ఛ లేకుండా పోయింది. పైగా అడిగిన సీట్లు ఇవ్వలేదు. దీంతో టీఆర్ఎస్‌ని వదిలి మళ్ళీ కాంగ్రెస్‌లోకి వచ్చేశారు. ఇక 2018 ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేసి సురేఖ ఓటమి పాలయ్యారు. ఓడిపోయిన దగ్గర నుంచి సురేఖ, కొండా మురళిలు దూకుడుగానే పనిచేస్తూ ముందుకెళుతున్నారు.
ఇక మధ్యలో సురేఖమ్మకు హుజూరాబాద్ ఉపఎన్నికలో పోటీ చేసే ఛాన్స్ వచ్చింది. కానీ అడిగిన సీట్లు ఇస్తేనే పోటీకి దిగుతామని చెప్పడం, అడిగిన సీట్లు ఇవ్వలేమని కాంగ్రెస్ అధిష్టానం చెప్పడంతో వారు పోటీకి దిగలేదు. అయితే కొండా ఫ్యామిలీ మొదట నుంచి పరకాలతో పాటు వరంగల్ ఈస్ట్, భూపాలపల్లి సీట్లు అడుగుతున్న విషయం తెలిసిందే. అయితే భూపాలపల్లి సీటులో గండ్ర సత్యనారాయణ ఉన్నారు. బీజేపీ నుంచి వచ్చిన ఆయనకు సీటు ఇస్తామని రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు. దీంతో భూపాలపల్లి సీటు కొండా ఫ్యామిలీకి దక్కడం కష్టమని అర్ధమైపోయింది.
ఇక వరంగల్ ఈస్ట్, పరకాల సీట్లు మాత్రం కొండా ఫ్యామిలీకి దక్కేలా ఉన్నాయి. ఇందులో పరకాల సీటులో కొండా ఫ్యామిలీ బాగా పుంజుకుంది. పైగా అక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై వ్యతిరేకత పెరుగుతుంది. అంటే పరకాలలో కొండా ఫ్యామిలీకి గెలవడానికి మంచి ఛాన్స్ ఉంది. కానీ ఈస్ట్‌లో టీఆర్ఎస్ స్ట్రాంగ్‌గా ఉండే..అక్కడే కాస్త డౌట్ ఉందని చెప్పొచ్చు.