నిజానికి ఆయన ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.. రేపు తిరుపతిలోని ఓ హోటల్‌లో ఎన్నికలు ముగిశాక.. సాయంత్రం 6 గంటలకు తన సర్వే ఫలితాలను వెల్లడిస్తానన్నారు.
ఆంధ్రా ఆక్టోపస్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. తొందరపడి ముందే కూసేశారు. అవును.. ఏం కూశారు అంటారా? ఎగ్జిట్ పోల్స్ ముందే చెప్పేశారు. నిజానికి.. రేపు సాయంత్రం వెల్లడించాల్సిన ఎగ్జిట్ పోల్స్‌ను ఇవాళే చెప్పకనే చెప్పేశారు. తెలంగాణలో కారును.. ఏపీలో సైకిల్ ప్రజలు కోరుకున్నారని స్పష్టం చేశారు.
కి ఆయన ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.. రేపు తిరుపతిలోని ఓ హోటల్‌లో ఎన్నికలు ముగిశాక.. సాయంత్రం 6 గంటలకు తన సర్వే ఫలితాలను వెల్లడిస్తానన్నారు. కానీ.. మీడియాతో మాట్లాడుతూ.. కారు, సైకిల్ జోరు మీద ఉన్నాయని చెప్పేశారు.
తర్వాత.. ఇప్పుడు చెప్పినవి కేవలం అంచనా మాత్రమేనని.. రేపు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో కచ్చితంగా చెబుతానంటూ మరో బాంబు పేల్చారు. కేంద్రంలో కూడా ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారో.. తన వద్ద ఫలితాలు ఉన్నాయని.. అయితే.. తనకు ఎక్కువగా తెలుగు రాష్ర్టాల్లో ఎవరు గెలుస్తారు.. అన్నదానిపైనే ఆసక్తి ఉన్నట్లు చెప్పారు లగడపాటి. అయితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం ఖచ్చితంగా ఈసారి శాసనసభలో అడుగుపెడుతారంటూ జోస్యం చెప్పారు.
లగడపాటి సర్వేలు ఇదివరకు మంచి డిమాండ్ ఉండేది. తెలుగు రాష్ర్టాల్లో సర్వేలు అంటేనే లగడపాటి గుర్తొచ్చేవారు కానీ.. ఆయన ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన సర్వే ఫలితాలు.. తారుమారయ్యాయి. పూర్తిగా రివర్స్ అయ్యాయి. దీంతో లగడపాటి సర్వే అంతా ఉత్తుత్తిదేనని ప్రజలు తేల్చేశారు. మరి.. ఈసారి ఆయన అంచనాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే మే 23 దాకా ఆగాల్సిందే.