రవి ప్రకాశ్‌పై ఇప్పటిపై నిధుల మళ్లింపు, ఫోర్జరీ, డేటా చోరీపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రవి ప్రకాశ్, శివాజీ అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్లు ఎక్కుడన్నారో తెలియదు.
క్రీశ 193 లో రోమన్ చక్రవర్తి పెర్టినాక్స్‌ను అతడి సైన్యమే హతమార్చి సామ్రాజ్యాన్ని వేలంలో అమ్మేశారట. రవిప్రకాశ్ దాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చాడు. టీవీ9 లోగోలను రూ.99 వేలకు తన మోజో టీవీకే విక్రయించి కార్పోరేట్ రంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాడు. వామ్మో.. రవిప్రకాశూ.. నువ్వు మామూలోడివి కాదు.. అంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్‌పై విమర్శనాస్ర్తాలు సంధించారు.
రవి ప్రకాశ్‌పై ఇప్పటిపై నిధుల మళ్లింపు, ఫోర్జరీ, డేటా చోరీపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రవి ప్రకాశ్, శివాజీ అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్లు ఎక్కుడన్నారో తెలియదు. పోలీసుల నోటీసులకూ స్పందించలేదు. దీంతో పోలీసులు కూడా వాళ్లపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. దీంతో వాళ్లు విదేశాలకు పారిపోయే అవకాశం ఉండదు. వాళ్ల ఆచూకి తెలిస్తే వెంటనే వాళ్లను అరెస్ట్ చేసేందుకు సైబరాబాద్ పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు.
క్రీ.శ.193లో రోమన్ చక్రవర్తి పెర్టినాక్స్‌ను అతని సైన్యమే హతమార్చి సామ్రాజ్యాన్ని వేలంలో అమ్మేశారట.రవిప్రకాష్ దాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చాడు.టీవీ9 లోగోలను రూ.99 వేలకు తన మోజోటివీకే విక్రయించి కార్పోరేట్ రంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాడు. వామ్మో!రవిప్రకాశూ నువ్వు మామూలోడివి కాదు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 18, 2019
అంతే కాదు.. మీడియా నయీం సంగతి తేల్చాలంటే.. బ్రోకర్ శివాజీని పట్టుకొని పోలీసులు తమ స్లయిల్ లో ప్రశించాలని ఆయన మరో ట్వీట్ చేశారు. అప్పుడు గరుడ పురాణం స్క్రిప్ట్ ఎవరిచ్చారో కూడా మొత్తం కక్కేస్తాడని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
బ్రోకర్ శివాజీని పట్టుకుని పోలీసులు తమ స్టైల్లో ప్రశ్నిస్తే గరుడ పురాణం స్క్రిప్ట్ ఎవరిచ్చారో కక్కేస్తాడు. అది మీడియా ‘నయీం’ పనే అని తేలుతుంది. ఈ నేరాలు విచారించాలంటే స్పెషల్ కోర్టులు కావాలి. 25 ఏళ్ల క్రితం వేయి జీతానికి పనిచేసినోడు వందల కోట్లు ఎలా పోగేశాడో తేల్చాలి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 18, 2019