2014 నుంచి కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నా. అందుకే.. రాజకీయాలకు దూరంగా ఉన్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ పార్టీకి నేను మద్దతు ఇవ్వలేదు. ఏ పార్టీలో చేరలేదు కూడా.. అంటూ లగడపాటి ఓ లేఖను విడుదల చేశారు..
ప్రజల నాడిని పట్టుకోవడంలో నేను విఫలమయ్యా. ఇక జీవితంలో సర్వేల జోలికి పోను. ఇక నుంచి నేను ఎలాంటి సర్వేలు చేయబోను. అప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నా సర్వే తప్పని తేలింది. ఇప్పుడు ఏపీలో నా సర్వే తప్పని తేలిపోయింది. నేను చెప్పిన సర్వే లెక్కలు ఎవరి మనసునైనా నొప్పించి ఉంటే నన్ను క్షమించాలి… అంటూ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆయన ప్రెస్ కు ఓ లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో ఇక తను సర్వేల జోలికి వెళ్లనని తెలిపారు.
2014 నుంచి కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నా. అందుకే.. రాజకీయాలకు దూరంగా ఉన్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ పార్టీకి నేను మద్దతు ఇవ్వలేదు. ఏ పార్టీలో చేరలేదు కూడా. నేను 2004 నుంచి సర్వేలు చేయడం ప్రారంభించా. చాలా రాష్ట్రాల్లో నేను సర్వేలు చేశాను. ప్రజల నాడిని పట్టుకొని మాత్రమే నేను సర్వేలు చేస్తా. నా సర్వే చాలా నిష్పక్షపాతంగా ఉంటుంది. నేను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా రిపోర్టు వచ్చింది. అదే రిపోర్టును ప్రజలకు చెప్పాను. కానీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నేను చేసిన సర్వేలు ఘోరంగా విఫలం అయ్యాయి. వాళ్ల నాడిని పట్టుకోలేకపోయినందుకు.. ఇక సర్వేలు చేయను. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైఎస్ జగన్ కు అభినందనలు… అంటూ రాజగోపాల్ తన లేఖలో పేర్కొన్నారు.
అంటే.. లగడపాటి ఇక సర్వేలు చేయనట్టే కదా. హమ్మయ్య.. లగడపాటి శకం ముగిసిపోయిందన్నమాట. అప్పుడు తెలంగాణ వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి ఇప్పుడు సర్వేలకు కూడా దూరమయ్యాడు. అంటే లగడపాటి ఖేల్ ఖతమయిపోయినట్టే ఇక.