లేటెస్ట్; ఏపీ కేబినేట్ భేటీ, రాజధాని తరలింపు తేదీ ఫిక్స్…?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు రాజధాని తరలింపు విషయంలో కాస్త సీరియస్ గానే ఉంది. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే రాజధానిని తరలించాలి అని పట్టుదలగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు రాజధాని తరలింపుకి తేదీ ఖరారు చెయ్యాలని భావిస్తుంది. అమరావతితో పాటుగా మరో రెండు రాజధానులు ఉండాలని భావిస్తున్న జగన్ సర్కార్ ఇప్పటికే విశాఖకు రాజధానిలోని కీలక భాగమైన పరిపాలానా విభాగాన్ని తరలిస్తున్నట్టు చెప్పింది.

ఇక కర్నులుకి న్యాయ రాజధానిని తరలించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విజిలెన్స్ కార్యాలయం సహా న్యాయవిభాగానికి చెందిన కార్యాలయాలను తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇప్పుడు రాజధాని తరలింపు విషయంలో జగన్ సర్కార్ మరో ముందు అడుగు వేయనుంది. ఉగాది నుంచి విశాఖలో పరిపాలన మొదలుపెట్టాలని భావిస్తున్న రాష్ట్ర సర్కార్… త్వరలో సంచలన నిర్ణయం తీసుకోనుంది.

మార్చ్ నాలుగు ఉదయం 11 గంటలకు కేబినేట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో రాజధాని తరలింపు తేదీని ఫిక్స్ చేయనున్నారు. ముందు రెవెన్యూ, ఆర్ధిక, జలవనరుల శాఖను తరలించాలని భావిస్తుంది. ఈ మేరకు ఆయా విభాగాల అధిపతులకు భేటీ తర్వాత ఉత్తర్వులు కూడా ఇచ్చే అవకాశ౦ ఉందని అంటున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా చర్చించే అవకాశం ఉందని సమాచారం.

అలాగే ఈ ఏడాది వేసవిలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న నేపధ్యలో నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి కూడా మార్గాలను ఈ భేటీ లో చర్చించే అవకాశం ఉంది. ఇక పోలవరం గురించి కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక హైకోర్ట్ తీర్పులు అన్నీ వ్యతిరేకంగా రావడంతో వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దానిపై కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.