సాక్షి , ఆంధ్ర జ్యోతి , రామోజీ ని చూసి నేర్చుకోవాలి !

-

కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అనుకోని ఈ విపత్కర పరిస్థితికి దేశవ్యాప్తంగా అన్ని రంగాలు మూతపడ్డాయి. దీంతో పేద మరియు మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారాయి. ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది ప్రముఖులు రాజకీయ నాయకులు సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు ఎవరికి వారు ఇటువంటి విపత్తు వేళ విరాళాలు ప్రకటిస్తూ తమ ఉదారతను చాటుతున్నారు.Sakshi, Eenadu And Andhra Jyothi Media Wrote Different News In ...తాజాగా మీడియా మొగల్ పేరొందిన రామోజీరావు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు భారీ స్థాయిలో విరాళం ప్రకటించారు. 20 కోట్లు ప్రకటిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల కు చెరో పది కోట్లు కరోనా వైరస్ కష్టకాలంలో  ప్రజలను ప్రభుత్వాలు ఆదుకోవాలని సాయంగా రామోజీరావు ముందుకొచ్చారు.

 

సాధారణంగా అయితే ఇంత భారీ మొత్తం డబ్బులను ముఖ్యమంత్రులకు దగ్గరకు వెళ్లి అందిస్తారు..కానీ రామోజీరావు మాత్రం రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆన్ లైన్ పద్దతిలో ఈ విరాళాన్ని ట్రాన్స్ ఫర్ చేయటం ద్వారా కొత్త కల్చర్ కు శ్రీకారం చుట్టారని చెప్పాలి. దీంతో ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రాలలో హైలెట్ గా నిలిచింది. సోషల్ మీడియాలో కూడా ఈ వార్త రావడంతో నెటిజన్లు రామోజీరావుపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఎప్పుడూ తమ స్వార్ధ రాజకీయాలు చేసే సాక్షి మరియు ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ యజమానులు రామోజీ ని చూసి నేర్చుకోవాలి అని సూచనలు ఇస్తున్నారు.ఇలాంటి టైమ్ లో అడగటం కాదు ఇవ్వటం నేర్చుకోండి అంటూ మరి కొంతమంది ఆ రెండు జనాలకు గట్టిగా బుద్ధి పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news