ప్రపంచ దేశాలను గజగజ లాడిస్తున్న కరోనా వైరస్ రాబోయే రోజుల్లో ఉన్న కొద్దీ ప్రమాదకరంగా మారనుందని లండన్ కి చెందిన ఇంపీరియల్ యూనివర్సిటీ అంచనా వేసింది. ఈ యూనివర్సిటీ చేసిన ఒక అధ్యయనంలో బయటపడిన లెక్కలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ గురించి బాంబు పేల్చినటు అయ్యింది. కఠినాతికఠిన చర్యలు తీసుకోలేకపోతే ఈ వైరస్ మహమ్మారి వల్ల అమెరికాలో దాదాపు 22 లక్షల మంది మరియు అదే విధంగా బ్రిటన్ లో 5 లక్షల మంది చనిపోయే అవకాశముందని ఆ విశ్లేషణ తెలిపింది.
మొత్తంమీద చూసుకుంటే యూరప్ మరియు అమెరికా దేశాలలో ఈ వైరస్ ప్రభావం రాబోయే రోజుల్లో భయంకరంగా మారనుందని యూనివర్సిటీ చెప్పుకొచ్చింది. అక్కడ ఉష్ణోగ్రతలు కరోనా వైరస్ కి బాగా సహకరిస్తాయని దీంతో ఆయా దేశాలు తగు చర్యలు తీసుకోకపోతే ఈ వైరస్ నుండి బయటపడటం కష్టమని ఇంపీరియల్ యూనివర్సిటీ అంచనా వేస్తోంది.
– రాయిటర్స్ సౌజన్యంతో.