గవర్నర్ ని కలిసిన బిజెపి, హుటాహుటిన ఎమ్మెల్యేలను హోటల్ కు తరలించిన శివసేన… ఏం జరుగుతుంది…?

-

మహారాష్ట్రలో శనివారంతో అసెంబ్లీ గడువు ముగియనున్న నేపధ్యంలో అక్కడి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటి రాకపోవడంతో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా సరే ఇతర పార్టీల అవసరం ఉంటుంది. 288 మంది సభ్యుల అసెంబ్లీలో 105 మంది ఎమ్మెల్యేలను బిజెపి గెలవగా… 56 మంది ఎమ్మెల్యేలు శివసేన నుంచి గెలిచారు. వీరిద్దరూ కలిసి 145 మెజారిటీ మార్కును అధిగమించిన నేపధ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెండు పార్టీలు కలిసి రావాల్సి ఉంది.

ఎన్నికల బరిలో కూటమిగా నిలిచిన ఈ రెండు పార్టీలు ముఖ్యమంత్రి పదవి విషయంలో 50;50 ఫార్ములా ప్రకారం వెళ్ళాలి అనేది శివసేన డిమాండ్ కాగా అందుకు బిజెపి అంగీకరించడం లేదు. దాదాపు రెండు వారాల నుంచి ఈ వ్యవహారం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని భావించినా అందుకు తగిన వాతావరణం కనపడటం లేదు. ఇప్పటికే ఎన్సీపీ అధినేత శరద్ పవార్… తాము ప్రతిపక్షంలోనే ఉంటామని ప్రకటించి… ఈ వార్తలకు తెర దించారు..

ఈ నేపధ్యంలో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. మహారాష్ట్ర బిజెపి నేతలు నేడు గవర్నర్ తో సమావేశమయ్యారు. ఈ పరిణామాల నేపధ్యంలో శివసేన జాగ్రత్త పడుతుంది. తమ పార్టీ ఎమ్మెల్యేలకు బిజెపి గాల౦ వేయకుండా ఉండేందుకు గాను వారిని హోటల్ కి తరలించింది. 182 మంది ఎమ్మెల్యేలకు బిజెపి మద్దతు ఇస్తున్నట్లు వచ్చిన వార్తలతో కంగారు పడిన ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలను హోటల్ లో ఉంచి ప్రలోభాలు పెట్టకుండా కాపలా కాస్తున్నారు. అలాగే కొంతమంది స్వతంత్రులు – బాంద్రాలోని హోటల్ రంగర్దాకు తరలించారు. దీనితో ఎప్పుడు ఏం జరుగుతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. రేపటిలోగా ప్రభుత్వ ఏర్పాటు జరగకపోతే రాష్ట్ర పతి పాలన విధించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news