బెంగాల్ ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటి నుంచో గవర్నర్ జగదీప్ ధన్ కర్ కు సీఎం మమతా బెనర్జీకి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయి. తాజాగా తన ట్విట్టర్ ఎకౌంట్ లో గవర్నర్ జగదీప్ ధన్ కర్ బ్లాక్ చేసింది మమతాబెనర్జీ. గవర్నర్ తమ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ట్విట్లు చేస్తుండటంతోనే ఈ పని చేసినట్లు దీదీ వెల్లడించింది. బెంగాల్ సీఎస్, డీజీపీలను బెదిరిస్తూ… గవర్నర్ ట్విట్లు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వ అధికారులను భయపెట్టే విధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. మేము అతని బంధిత కార్మికులమా అంటూ తీవ్ర స్థాయిలో మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు.
గవర్నర్ తో బెంగాల్ సీఎం సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్న సంగతి తెలిసిందే. గతంలో కూడా బెంగాల్లో మమతా బెనర్జీ రాజ్యాంగ వ్యతిరేఖ పాలన కొనసాగిస్తుందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్ల గురించి కూడా గవర్నర్ జగదీప్ ధన్ కర్ కేంద్ర ప్రభుత్వానికి పలు రిపోర్టలు కూడా పంపించారు.