వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్రంలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయని మాజీ హోంమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనబెట్టి రాజారెడ్డి రాజ్యాంగంను అమలు చేస్తున్నారని పోలీసులు వైసీపీ నేతల తీరుపై ఆయన మండిపడ్డారు.
అయితే దళితుడైన జస్టిస్ రామకృష్ణకు అన్యాయం జరిగిందన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిపై కేసు పెడితే జస్టిస్ రామకృష్ణపై కౌంటర్ కేసు పెట్టడానికి జగన్ ప్రభుత్వం సిద్దమైయిందని పేర్కొన్నాడు. ఇది అన్యాయమని దళిత, సామాజిక వర్గం వారందరినీ కుట్ర ద్వారా అణగతొక్కాలని ప్రభుత్వం పన్నాగం పన్నుతోందన్నారు. అంతేకాక సీతానగరంలో వరప్రసాద్ అనే దళితుడిని పోలీసులే శిరోముండనం చేసి చిత్రహింసలకు గురి చేశారని ఈ సందర్బంగా తెలిపారు. చీరాలలోమరో దళితుడికి మాస్కు లేదనే నెపంతో పోలీసులులే కొట్టి చంపడం చేయడంతో శాంతిభద్రతలు క్షీణించాయని తెలిపారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ సంపూర్తిగా నిర్వీర్యం అయిందని చినరాజప్ప తీవ్ర స్థాయిలో విమర్శించారు.