టీడీపీ నేతల బండారం బయటపెడతా: ఏపీ మంత్రి

టీడీపీ నేతల బండారం బయటపెడతామని మంత్రి అనీల్ కుమార్ యాదవ్ అన్నారు. పోలవరం విషయంలో తప్పులు చేసింది ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలియాలి అని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పై ఆయన కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ ని నిర్లక్ష్యం చేసింది ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసు అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ని జాతీయ ప్రాజెక్ట్ గా కేంద్రం ప్రకటించింది అన్నారు.

2014 నుంచి రెండేళ్ళ పాటు తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ని పట్టించుకోలేదు అని ఆయన మండిపడ్డారు. 2016 లో కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజికి అంగీకరించిన టీడీపీ ఆ తర్వాత ప్రాజెక్ట్ ని ప్యాకేజి పరిధిలోకి తెచ్చింది అని ఆయన విమర్శలు చేసారు. టీడీపీ కారణంగానే పోలవరం ప్రాజెక్ట్ లేట్ అయింది అని ఆయన మండిపడ్డారు.