రాష్ట్రాల మ‌ధ్య గొడ‌వ‌లోకి ప్ర‌జ‌ల‌ను లాగుతున్న మంత్రి జగదీష్ రెడ్డి.. కార‌ణ‌మేంది..?

ప్రస్తుతం రెండు రాష్ర్టాల మధ్య నడుస్తున్న జల వివాదాల్లోకి రెండు రాష్ర్టాల ప్రజలను లాగే ప్రయత్నాలను చేస్తున్నారు నేతలు. ప్రస్తుతం ఇరు రాష్ర్టాల నేతలు చేసే కామెంట్లతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఎటువంటి సంబంధం లేని ప్రజలను అనవసర వివాదాల్లోకి లాగుతున్నారని మండిపడుతున్నారు. ఒక్కరనే కాదు అందరు రాష్ర్ట నేతల పరిస్థితులు ఇదే విధంగా ఉన్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. తమను అనవసర విషయాల్లోకి లాగద్దని చెబుతున్నారు.

ప్రజల ప్రయోజనాల కన్నా నేతల ప్రయోజనాలే అధికంగా ఉన్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు నేతలైతే ఏకంగా కాలం చేసిన నాయకుల మీదే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇలా చేయడం వల్ల రెండు రాష్ర్టాల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతింటాయని ప్రజలు మొత్తుకుంటున్నా వినకుండా వ్యవహరిస్తున్నారు. గత ఏడేళ్లుగా కలిసి ఉన్న తమను విడదీయొద్దని ప్రజలు అంటున్నారు.

జలాల విషయంలో మీది తప్పు అంటే మీది తప్పు అనే విషయం కాస్త చిలికిచిలికి గాలివానలా తయారయింది. ఏపీ ప్రభుత్వమే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని తెలంగాణ మంత్రులు విమర్శలు చేస్తున్నారు. అంతే కాకుండా సీఎం జగన్ మోహన్ రెడ్డి తీరు మరీ చిన్న పిల్లాడిలా ఉందని ఆరోపిస్తున్నారు. తెలంగాణ సీఎం స్నేహం చేసేందుకు చూసినా కూడా వినట్లేదని అంటున్నారు. జీవో 203ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.