ప్రపంచ ఇమోజీ డే: ఎమోజీ అనేది అసలు ఎలా వచ్చిందో తెలుసా..?

-

మనం ఎప్పుడు ఎవరికైనా మెసేజ్ పెట్టాలన్నా సరదాగా ఏమైనా మాట్లాడుకోవాలన్నా ఎమోజిలతో మాట్లాడుకోవచ్చు. ఎమోజిలతో మనం మాటల రూపంలో చెప్పలేని ఎన్నో సంభాషణలని, హావభావాలని తెలియజేస్తాయి.

మన సంతోషాన్ని, బాధని, ప్రేమని, కన్నీరుని ఎమోజిలతో వ్యక్తపరచవచ్చు. అదే విధంగా కొన్ని జంతువులని, పక్షులని, ఆహార పదార్థాలని ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఎమోజిలతో మనం చూపించొచ్చు.

అయితే ప్రతి సంవత్సరం జూలై 17 న ప్రపంచ ఎమోజీలా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఎమోజిలకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఆలస్యమెందుకు వాటి కోసం ఎన్నో విషయాలను ఇప్పుడు చూసేయండి.

ఎమోజిలలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఇవి ఇప్పుడు అయితే మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. చాలా మంది ఎమోజిలు లేకుండా మెసేజ్లు పంపడం లేదు.

అసలు ఎమోజీ ఎలా వచ్చింది..?

అసలు ఇది ఎలా వచ్చింది అనేది చూస్తే… మొదటిసారి ఎమోజి అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ప్రసంగంతో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. 1962వ సంవత్సరంలో ఆయన ప్రసంగం లో వివిధ రకాల ఎక్స్ప్రెషన్స్ అభిమానుల్ని ఎంతగానో అలరించాయి. ఇలా ఇవి పాపులర్ అవ్వడం జరిగింది.

మీడియా సంస్థలు పేపర్లలో ఆయన ప్రసంగం పక్కనే ఎమోజీని పెట్టారట. అలా ఎన్నో ఎమోజీలు పుట్టుకొచ్చాయి.

ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఎవరికైనా మెసేజ్ పెట్టాలన్న లేదు అంటే మన భావాలను పంచుకోవాలన్నా చక్కగా సింపుల్ గా ఎమోజితో షేర్ చేసుకుంటున్నాము. ఎన్నో భావాలను మనం సులువుగా పంచుకుంటున్నాము. యూనికోడ్ కన్సార్టియం ఆమోదం లభించిన తర్వాతే ఎమోజీలని విడుదల చేయడం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news