ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టొద్దు: హరీష్ రావు

-

సంగారెడ్డి పట్టణంలోని నాల్సాబ్ గడ్డ , నారాయణరెడ్డి ప్రాంతాల్లో మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు కీలక సూచనలు చేసారు. మంత్రి ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ… మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న విపరీతమైన వర్షాల వలన ఈ ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు రావడం , ఇళ్లు కూలడం జరిగిందని ఆయన అన్నారు. ఇళ్లు కూలిన వారికి తక్షణ సాయం కింద ఆర్థిక సహాయం , నిత్యావసర వస్తువులు అందించాం అని చెప్పారు.

నాల్సాబ్ గడ్డలో మురుగు నీరు ప్రవహించే కాలువ పనులు పెండింగ్ లో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ పనులను యుద్ధప్రాతిపదికన చేయడానికి అధికారులకు ఆదేశాలిచ్చాం అని ఆయన తెలిపారు. ఇందు కోసం కోటీ యాబై లక్షల రూపాయలను మంజూరు చేశామని మంత్రి వివరించారు. మూడు, నాలుగు రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నాలాలను ఆక్రమించి జరిగిన నిర్మాణాలను వెంటనే తొలగించాలన్నారు. నాలాలను ఆక్రమించడం వలన వర్షాలు పడినప్పుడు ఇలాంటి సమస్యలే వస్తాయన్నారు. రోడ్లు, నాలాలు కబ్జా చేసి ఇళ్లను కట్టవద్దని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news