ఆంధ్ర ప్రదేశ్ లోని వైజాగ్ లో వైఎస్ జగన్ పై ఇవాళ జరిగిన దాడి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో కోళ్ల పందేలకు వాడే కత్తితో ఓ యువకుడు జగన్ పై అటాక్ చేసిన సంగతి తెలిసిందే. కత్తితో జగన్ చేతిపై పొడవగా.. తన చేతికి గాయాలయ్యాయి. ప్రస్తుతం జగన్ హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు. ఆయన ప్రమాదం నుంచి బయట పడ్డారు.
జగన్ పై జరిగిన దాడిని పలు రాజకీయ నాయకులు ఖండించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ జగన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఆ దాడికి సంబంధించిన బాధ్యులను కఠినంగా శిక్షించాలని మంత్రి డిమాండ్ చేశారు. జగన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు మంత్రి ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు @ysjagan గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధ్యులను కఠినంగా శిక్షించాలి. జగన్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
— KTR (@KTRTRS) October 25, 2018