“వాళ్ళిద్దరికీ కేంద్ర పదవులు .. NDA లో కలవండి” జగన్ కి డిల్లీ బంపర్ ఆఫర్ !!

ఇటీవల ఢిల్లీ ఎన్నికలలో బిజెపి పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం జరిగింది. ఒక ఢిల్లీలోనే కాదు 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత మహారాష్ట్ర మరియు చత్తీస్ ఘర్ రాష్ట్రాల్లో ఓడిపోవడంతో మొత్తం మూడు రాష్ట్రాల్లో బిజెపికి పరువూ పోయింది. దానికి కారణం అధికారంలోకి వచ్చాక తీసుకున్న నిర్ణయాలన్ని చాలామంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దేశాన్ని విభజించే విధంగా ఒక ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా బీజేపీ వ్యవహరించిన తీరుకు దేశంలో వ్యతిరేకత మొదలైంది అన్న వార్తలు వస్తున్నాయి.

Image result for modi jagan

దీంతో బీజేపీ పెద్దలు జాగ్రత్త పడటానికి రెడీ అయినట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది. మేటర్ లోకి వెళితే ఢిల్లీ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత దేశంలోనే రోజురోజుకీ రాజకీయంగా క్రేజ్ పెరుగుతున్న జగన్ తో మోడీ భేటీ కావడం జరిగింది. దాదాపు గంటకు పైగా జరిగిన వీరిద్దరి మధ్య చర్చలలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు అదేవిధంగా నిధుల గురించి సరైన సమయంలో విడుదల చేయాలని మోడీకి జగన్ విజ్ఞప్తి చేసినట్లు వార్తలు వచ్చాయి.

 

ఇదే తరుణంలో మోడీ భవిష్యత్తులో వైసీపీ పార్టీతో కలిసి పనిచేయాలని ఎన్డీయే కూటమి తో భాగస్వాములు కండి అంటూ  జగన్ ని కోరినట్లు జాతీయ మీడియా వర్గాల్లో టాక్. ఇందుకోసం కేంద్ర మంత్రివర్గంలో రెండు మంత్రి పదవులు ఇస్తామని జగన్ కి బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారట. దీంతో ఒకవేళ వైసిపి రాష్ట్ర భవిష్యత్తు నిమిత్తమై ఎన్డీఏ లో చేరితే ఆ రెండు మంత్రి పదవులు ఎస్సీ, రెడ్డి వర్గం ఎంపీల‌కు ప‌ద‌వులు వ‌స్తాయ‌ని లెక్క‌లు వేసుకుంటున్నారు. రెడ్డి వ‌ర్గం నుంచి విజయసాయిరెడ్డికి ఎస్సీ వర్గం నుండి నందిగామ సురేష్ కి వచ్చే అవకాశం ఉన్నట్లు వైసీపీ పార్టీలో వార్తలు వినబడుతున్నాయి. మరి మోడీ ఆహ్వానం మేరకు జగన్ ఎన్డీఏ కూటమిలో కి వెళతారో లేదో చూడాలి.