కాంగ్రెస్ మీద మోడీ సెటైర్… వాళ్ళు అనవసరం…!

పార్లమెంటు ఉభయ సభల్లో కలిపి 100 మంది సభ్యులు కూడా కాంగ్రెస్ కి లేరు అని ప్రధాని మోడీ ఎద్దేవా చేసారు. బీహార్ లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ రోజు కాంగ్రెస్ అటువంటి స్థితిలో ఉంది అని ఆయన అన్నారు. మీరు లోక్సభ మరియు రాజ్యసభలను కలిపితే, వారికి 100 మంది ఎంపీలు కూడా లేరని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇప్పుడు చర్చను నడిపించలేదన్నారు.

అందుకే పార్లమెంటులో దాని మొత్తం బలం 100 కన్నా తగ్గిపోయింది అని ఆయన ఎద్దేవా చేసారు. మోడీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) రాజ్యసభలో తొలిసారిగా 100 మార్కును దాటింది. ఎన్డియే బలం రాజ్యసభలో 104 వద్ద ఉంది. 242 మంది సభ్యుల రాజ్యసభలో సుదీర్ఘకాలం ఆధిపత్యం వహించింది కాంగ్రెస్. ఇప్పుడు వారి బలం 38 గా ఉంది. లోక్‌సభలో తన ఎంపీలతో పాటు, కాంగ్రెస్‌ కు ఇప్పుడు పార్లమెంటులో మొత్తం 89 మంది సభ్యులు ఉన్నారు.