గ్రహణం చూడటానికి మోడీ వాడిన కళ్ళ జోడు ధర తెలిస్తే…!

-

ఒడిశా, కేరళ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర మరియు ఢిల్లీలో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ప్రజలు వీక్షించారు. అరుదైన సూర్యగ్రహణం కావడంతో ప్రజలు చూడటానికి ఆసక్తి చూపించారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ కూడా చాలా మంది భారతీయులతో కలిసి గ్రహణాన్ని వీక్షించారు. అయినా సరే మేఘాల కారణంగా ఆయన సూర్యగ్రహణాన్ని వీక్షించలేకపోయారు. రక్షిత గేర్లతో దాన్ని చూడటానికి ఆయన ప్రయత్నించారు. దీనిపై ఆయన సోషల్ మీడియాలో ఫోటో ని కూడా పోస్ట్ చేసారు.

“చాలా మంది భారతీయుల మాదిరిగానే నేను సోలారెక్లిప్స్ -2019 గురించి ఉత్సాహంగా ఉన్నాను. దురదృష్టవశాత్తు, క్లౌడ్ కవర్ కారణంగా నేను సూర్యుడిని చూడలేకపోయాను, కాని నేను కోజికోడ్‌లోని గ్రహణం యొక్క సంగ్రహావలోకనం మరియు ప్రత్యక్ష ప్రసారంలో ఇతర భాగాలను పట్టుకున్నాను” అని ట్వీట్ చేశారు. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మోడీ తరహాలో కొంత మంది సూర్యగ్రహణం వీక్షిస్తూ తమ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

మోడీ పోస్ట్ చేసిన కాసేపటికే ఆ ఫోటో వైరల్ గా మారింది. ఇక దీనిపై విమర్శకులు కూడా ఘాటుగానే స్పందించారు. మోడీ తాను పేదింటి వ్యక్తిని అని చెప్తారు, కాని ఆయన గ్రహణం వీక్షించడానికి వినియోగించిన కళ్ళ జోడు ధర మాత్రం రెండు లక్షలకు పైనే అని ట్వీట్ చేసి విమర్శిస్తున్నారు. అది మే బ్యాక్ కంపెనీ కి చెందినది కావడం విశేషం. దేశం ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నా మోడీ విలాసాలకు ఎం లోటు లేదని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. ఇక ఆయన ఫోటో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news