చెదిరిన మోదీ క‌ల‌…. ఆ ఆశ నెర‌వేర‌న‌ట్టే…!

-

ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుడుతూ తనకు ఎదురు లేకుండా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే జ‌మిలీ ఎన్నిక‌లు అనే అంశాన్ని ప్రధానంగా తెరమీదకు తీసుకువచ్చారు. 2022లో దేశం అంతా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌స‌భ ఎన్నికలు నిర్వహించి జమిలి ఎన్నికలు నిర్వహించాలని కంకణం కట్టుకుని మరీ మోదీ కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మహా అయితే జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లులు కూడా రెండు మూడు నెలల్లో పాస్‌ అయిపోతాయని అనుకున్నారు.

దేశవ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మోదీ తప్ప మరో నాయకుడు కనుచూపుమేరలో కనిపించడం లేదు. అక్కడక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నా మిగిలిన జాతీయ పార్టీలు అంటూ మోదీకి ఎంత మాత్రం పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. జమిలి ఎన్నికలకు ఇంతకంటే మించిన త‌రుణం లేదని అనుకుంటున్న సమయంలో తాజాగా మహారాష్ట్ర నాతోపాటు పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత జమిలి ఎన్నికలు జరిగే పరిస్థితి లేదన్నది స్పష్టం గా తెలుస్తోంది.

హరియాణా పార్లమెంటు ఎన్నికలలో పదికి పది స్థానాలు బిజెపి గెలుచుకుంది. 79 అసెంబ్లీ నియోజకవర్గాలలో ముందు ఉంది. ఇప్పుడు 40 స్థానాలు కూడా గెలుచుకోలేదు. అంతెందుకు
హరియాణాలో కాబినెట్‌లోని 8 మంది మంత్రులు ఓడిపోయారు. హరియాణా బిజెపి అధ్యక్షుడు ఓడిపోయాడు. కాంగ్రెస్‌కు గతంలో కంటె 16 సీట్లు ఎక్కువగా, కాంగ్రెస్‌కు 31 వచ్చాయి. బిజెపి తరఫున మోదీ, అమిత్‌ వచ్చి సభలు నిర్వహించగా కాంగ్రెసు తరఫున  సోనియా, రాహుల్‌, మరి ఏ యితర జాతీయ నాయకుడు తొంగి చూడలేదు. స్థానిక నాయకులే తిరిగారు, గెలిచారు.

మ‌హారాష్ట్ర‌లో శివ‌సేనకు బీజేపీ కంటే చాలా త‌క్కువ సీట్లు వ‌చ్చినా ఎన్ని డిమాండ్లు పెడుతుందో చూస్తూనే ఉన్నాం. నార్త్‌లోనే రోజు రోజుకు ప‌రిస్థితి మారుతుంటే ఇక సౌత్‌లో క‌ర్నాక‌ట మిన‌హా ఆ పార్టీ గురించి మాట్లాడుకునే ప‌రిస్థితి లేదు. ఇక ఆ పార్టీ రాష్ట్రాల్లో మెజార్టీ రాక‌పోయినా బ‌ల‌ప్ర‌యోగాలు, బెదిరింపుల ద్వారా ప్ర‌భుత్వాలు ఏర్పాటు చేస్తుందే త‌ప్పా బీజేపీపై ఉన్న వ్య‌తిరేక‌త క్లీయ‌ర్‌గా క‌నిపిస్తోంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో జ‌మిలీ ఎన్నిక‌లు సాధ్యం కావాలంటే… అందుకు త‌గ్గ బిల్లులు పాస్ కావాలంటే క‌నీసం 90 శాతం రాష్ట్రాలు బీజేపీ కంట్రోల్‌లో ఉండాలి.

ఇక రాజ్య‌స‌భ‌లో బీజేపీ బ‌లం పెంచుకున్నామ‌ని సంబ‌ర ప‌డుతున్నా తాజా ఫ‌లితాల‌తో మ‌ళ్లీ ఆ పార్టీ రాజ్య‌స‌భ సీట్లు త‌గ్గిపోనున్నాయి. ఇలాంటి ఎదురు దెబ్బ‌ల నేప‌థ్యంలో మోదీ క‌ల‌ల ఆశ అయిన జ‌మిలీ ఎన్నిక‌ల గురించి ఇప్ప‌ట్లో మ‌ర్చిపోవ‌డ‌మే బెట‌ర్‌.

Read more RELATED
Recommended to you

Latest news