చంద్రబాబుతో తేడా కొట్టిన తర్వాత సినీ నటుడు మోహన్ బాబు రాజశేఖర్ రెడ్డి టైమ్ లోనే కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. జగన్ మరణం తర్వాత ఆ కుటుంబాన్ని బాబు వదల్లేదు. జగన్ కి అత్యంత సన్నిహితుడు మెలుగుతున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి నెల రోజుల పాలన గురించి మీడియా ఓ రేంజ్ లో హైలైట్ చేస్తుంది. జగన్ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వయసులో చిన్నోడు..అనుభవం లేని వాడు…రాష్ర్టాన్ని చేతుల్లో పెడితే ఎలా? అని అప్పుడు ప్రశ్నించిన మీడియానే నేడు ప్రశంసిస్తోంది. కాదు కాదు బాకా కొడుతుంది. నిజానికి జగన్ పాలన గురించి మీడియా చెప్పకపోయినా ప్రజలకు తెలుసు అనుకొండి. కానీ ఇప్పుడు ఎంతైనా జగన్ అవసరం మీడియాకి ఉంది కాబట్టి…ఇలా యూ టర్నత్ తీసుకుంది. అప్పుడు చంద్రబాబు వెంట ఉన్న మీడియా…ఇప్పుడా ఆయన్ని ఏకాకిని చేసింది. అయినా మీడియా చేసిన ప్రతీ పనిని జగన్ గుర్తుంచుకుంటాడనుకోండి. అది వేరే విషయం.
ఇక చంద్రబాబుతో తేడా కొట్టిన తర్వాత సినీ నటుడు మోహన్ బాబు రాజశేఖర్ రెడ్డి టైమ్ లోనే కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. జగన్ మరణం తర్వాత ఆ కుటుంబాన్ని బాబు వదల్లేదు. జగన్ కి అత్యంత సన్నిహితుడు మెలుగుతున్నారు. ఇటీవలే ఎఫ్ డీసీ చైర్మన్ గా మోహన్ బాబు ని నియమించే అవకాశం ఉందని రూమర్లు వచ్చాయి. కానీ వాటిని మోహన్ బాబు కొట్టిపారేసారు. ఎలాంటి పదవి కోరుకోలేదని..ప్రజలకు మంచి చేసే వ్యక్తి సిఎం అయితే చాలు అనుకున్నట్లు వెల్లడించారు. తాజాగా నేడు మోహన్ బాబు మిజోరాం మాజీ గవర్నర్ వినోద్‌కుమార్ దుగ్గల్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
అనంతరం మీడియాతో తనదైన శైలిలో మాట్లాడారు. నా కోరిక ఫలించింది. అందుకే ఏడాదిన్నర తర్వాత శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నా. ఆ కోరికేంటో భగవంతుడికి తెలుసని పరోక్షంగా జగన్ సిఎం అవ్వడంతోనే తన కోరిక ఫలించిందని హింట్ ఇచ్చారు. నేరుగా మీడియా ముందు జగన్ గురించి ప్రస్తావిస్తే బాకా కొడుతున్నట్లు ఉంటుందని కోరిక అని మ్యానేజ్ చేసినట్లు తెలుస్తోంది. చివరిగా రాష్ర్టానికి మంచి ముఖ్యమంత్రి వచ్చాడని, మంచి పరిపాలన సాగుతోందని మోహన్ బాబు అన్నారు.